AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. కట్‌చేస్తే.. నెక్ట్స్ సిగ్నల్‌లో దిమ్మతిరిగే ట్విస్ట్..

Street Catcalling Incident Self Defense: పట్టణ ప్రాంతాల్లో ఒంటరి మహిళలపై జరుగుతున్న ఇలాంటి ఈవ్ టీజింగ్ సంఘటనలకు ఈ వీడియో ఒక బలమైన సమాధానంగా నిలిచింది. భయాన్ని వీడి ధైర్యంతో ఎదురుతిరిగితే ఎంతటి వారైనా లొంగిపోక తప్పదని ఈ లండన్ యువతి ప్రపంచానికి చాటిచెప్పింది.

Video: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. కట్‌చేస్తే.. నెక్ట్స్ సిగ్నల్‌లో దిమ్మతిరిగే ట్విస్ట్..
Woman Cyclist Retaliates Street Harassment
Venkata Chari
|

Updated on: Jun 10, 2026 | 7:24 AM

Share

Viral Video Woman Rips Van Mirror: వీధుల్లోకి ఒంటరిగా వెళ్లే మహిళలను చూసి ఈలలు వేయడం, వెటకారంగా మాట్లాడటం వంటి పనులకు పాల్పడే ఆకతాయిలకు ఒక యువతి గట్టి బుద్ధి చెప్పింది. తమ్ముడూ అని పిలిచి బుజ్జగించడం కాదు.. తప్పు చేస్తే తాట తీస్తాం అన్నట్లుగా ప్రవర్తించిన ఒక వీరనారి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ్ముళ్లూ జాగ్రత్త.. అమ్మాయిలు ఓపిక నశిస్తే ఎలా ఉంటారో చూపే ఈ పాత వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఈవ్ టీజింగ్‌కు దిగిన ఆకతాయిలు.. వెంటాడి వేటాడిన యువతి..

లండన్ నగర వీధుల్లో ఒక యువతి ఎంతో ప్రశాంతంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యాన్ (కారు) లోని కొందరు పురుషులు ఆమెను చూసి అసభ్యకరమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఆమెను వేధిస్తూ, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూశారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో అమ్మాయిలు భయపడతారని లేదా ఏడుస్తూ వెళ్ళిపోతారని ఆ ఆకతాయిలు భావించి ఉండవచ్చు.

కానీ ఆ యువతి అలా చేయలేదు. ఆకతాయిల ప్రవర్తనతో ఆమెకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. కోపంతో ఊగిపోయిన ఆ యువతి సైకిల్‌పైనే ఆ వ్యాన్‌ను వేగంగా వెంటాడింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆ వాహనం ఆగడమే ఆలస్యం.. సింహంలా కదిలి సిగ్నల్ వద్ద ఆ కారును పట్టుకుంది.

క్షణాల వ్యవధిలో బుద్ధి చెప్పిన లేడీ..

ఆ వాహనం పక్కకు చేరిన యువతి, ఏమాత్రం సంకోచించకుండా తన చేతులతో ఆ వ్యాన్ సైడ్ మిర్రర్‌ను (వెనుక వైపు చూసే అద్దాన్ని) బలంగా పట్టుకుని ఒకే ఒక్క ఊపుతో పీకేసింది. తమ కారు అద్దం ఊడిపోవడంతో లోపల ఉన్న పురుషులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఆమె చేసిన ఈ ఆకస్మిక దాడికి ఏం చేయాలో తెలియక వారు నోరెళ్లబెట్టారు. ఆకతాయిలకు తగిన శాస్తి చేసిన ఆ యువతి, ఏమీ జరగనట్లుగా అక్కడి నుంచి తన సైకిల్‌పై రాజసం ఉట్టిపడేలా వెళ్ళిపోయింది. ఈ మొత్తం దృశ్యాలను వెనుక వస్తున్న ఒక మోటార్ సైకిలిస్ట్ తన హెల్మెట్ కెమెరాలో రికార్డ్ చేశాడు.

పాత వీడియో అయినా.. నెట్టింట వెల్లువెత్తుతోన్న ప్రశంసలు..

నిజానికి ఈ సంఘటన కొన్ని ఏళ్ల క్రితం (2017లో) జరిగినప్పటికీ.. ప్రస్తుతం ఒక ప్రముఖ టర్కిష్ మీడియా సోషల్ మీడియా ఖాతా ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో రీ-సర్క్యులేట్ అయిన కొద్ది గంటల్లోనే దాదాపు 8 లక్షలకు పైగా వీక్షణలను (వ్యూస్) సొంతం చేసుకుని ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

“ప్రతి అమ్మాయి ఇలాగే ధైర్యంగా స్పందిస్తే వీధుల్లో వెధవల ఆటలు సాగవు” అంటూ నెటిజన్లు సదరు యువతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇది చట్టబద్ధమైన స్వయం రక్షణ.. రోడ్లపై మహిళలను వేధించే ప్రతి ఒక్కరికీ ఇదొక గుణపాఠం” అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆ వాహనంలో ఉన్న ఆకతాయిల ఐడెంటిటీని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..