AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం కొనేటట్టులేదు.. ఈ ధరలేంది బాబోయ్! రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల రేట్లు చూశారా..?

వరుణుడు ముఖం చాటేశాడు. జులై నెలాఖరుకు వచ్చినా వాన జాడ కానరావడం లేదు. వాన దేవుడు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి నాలుగు చినుకులు రాల్చి మమా అనిపించేస్తున్నాడు. ఈ ఏడాది వానలకు కనీసం భూమి కూడా తడవలేదు. వాన పడితే చేలో విత్తాలని రైతు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఆశలు చావడం లేదు. ఆగస్టులోనైనా వాన సమృద్ధిగా పడుతుందేమోనని గంపెడు ఆశలతో ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి..

ఏం కొనేటట్టులేదు.. ఈ ధరలేంది బాబోయ్! రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల రేట్లు చూశారా..?
Kukatpally Rythu Bazaar Prices Today
Srilakshmi C
|

Updated on: Jul 27, 2026 | 3:03 PM

Share

హైదరాబాద్, జూలై 27: బియ్యం, ఉప్పు, పప్పులతోపాటు కూరగాయలు, పండ్లు ధరలు పెరుగుతున్న ధరల నేపథ్యంలో సమాన్యుడు ఎప్పుడేం జరగుతుందో తెలియక కంగారు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్ జూలై 27కు సంబంధించిన తాజా కూరగాయల ధరల జాబితాను విడుదల చేసింది. టమాటా, ఆలుగడ్డ, దోసకాయ వంటి రోజువారీ అవసరమైన కూరగాయలు తక్కువ ధరకే లభిస్తున్నా.. వెల్లుల్లి, ఎండు మిర్చి, అల్లం వంటి కొన్ని వస్తువుల ధరలు మాత్రం దడ పుట్టిస్తున్నాయి.

టమాటా, ఆలుగడ్డ ధరలు ఎంత?

రైతు బజార్‌లో టమాటా కిలో రూ.18, ఆలుగడ్డ కిలో రూ.18గా విక్రయిస్తున్నారు. అలాగే దోసకాయ, సొరకాయ కిలో రూ.15 మాత్రమే ఉండటంతో వినియోగదారులకు ఊరటనిస్తోంది.

ఇతర ముఖ్యమైన కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..

  • వంకాయ కిలో ధర: రూ.23
  • బెండకాయ కిలో ధర: రూ.35
  • పచ్చిమిర్చి కిలో ధర: రూ.37
  • బజ్జి మిర్చి కిలో ధర: రూ.50
  • కాకరకాయ కిలో ధర: రూ.32
  • బీరకాయ కిలో ధర: రూ.38
  • క్యాబేజీ కిలో ధర:రూ.21
  • క్యారెట్ కిలో ధర: రూ.41
  • కాలీఫ్లవర్ కిలో ధర: రూ.25
  • దొండకాయ కిలో ధర: రూ.35
  • చిక్కుడుకాయ కిలో ధర: రూ.65
  • గోరుచిక్కుడు కిలో ధర: రూ.35
  • బీట్‌రూట్ కిలో ధర: రూ.32
  • క్యాప్సికమ్ కిలో ధర: రూ.45
  • కంద కిలో ధర: రూ.45
  • ఉల్లిగడ్డ కిలో ధర: రూ.32
  • ఉల్లితొడ కిలో ధర: రూ.55

పండ్లు, మసాలా దినుసుల ధరలు

  • బొప్పాయి కిలో ధర: రూ.40
  • ఉసిరి కిలో ధర: రూ.85
  • పల్లీలు కిలో ధర: రూ.75
  • ఎండు మిర్చి కిలో ధర: రూ.260
  • వెల్లుల్లి కిలో ధర: రూ.260
  • పాత అల్లం కిలో ధర: రూ.200
  • చింతపండు కిలో ధర: రూ.160
  • పండు మిర్చి కిలో ధర: రూ.80
  • కరివేపాకు కిలో ధర: రూ.50
  • అరటికాయ (ఒక్కటి): రూ.10 నుంచి రూ.11
  • ముల్లంగి (ఒక్కటి): రూ.6 నుంచి రూ.8
  • మునగకాయ (ఒక్కటి): రూ.8 నుంచి రూ.10
  • నిమ్మకాయలు (డజన్): రూ.26 నుంచి రూ.32
  • మామిడికాయ (ఒక్కటి): రూ.15 నుంచి రూ.20

నోట్: రైతు బజార్‌లలో నేరుగా రైతుల నుంచి కూరగాయలు విక్రయించబడటం వల్ల మార్కెట్‌తో పోలిస్తే కొంత తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులు లభించే అవకాశం ఉంటుంది. అయితే సరఫరా, డిమాండ్‌ను బట్టి ధరల్లో రోజువారీ మార్పులు ఉండొచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిది.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర