Cyclone Tauktae : తూర్పుమధ్య అరేబియా సముద్రం మీదున్న అతి తీవ్ర తుఫాను తౌక్టే.. 18వ తేదీ ఉదయం తీరాన్ని దాటే అవకాశం

Cyclone Tauktae : ఉవ్వెత్తున ముంచుకొస్తోన్న తౌక్టే తుఫాను నేపథ్యంలో అమరావతిలోని వాతావరణ కేంద్రం పలు వాతావరణ సూచనలు వెల్లడించింది..

Cyclone Tauktae : తూర్పుమధ్య అరేబియా సముద్రం మీదున్న అతి తీవ్ర తుఫాను తౌక్టే..  18వ తేదీ ఉదయం తీరాన్ని దాటే  అవకాశం
Tauktae Cyclone
Follow us

|

Updated on: May 16, 2021 | 6:20 PM

Cyclone Tauktae : ఉవ్వెత్తున ముంచుకొస్తోన్న తౌక్టే తుఫాను నేపథ్యంలో అమరావతిలోని వాతావరణ కేంద్రం పలు వాతావరణ సూచనలు వెల్లడించింది. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా సముద్రం మీద ఉన్న అతి తీవ్ర తుఫాను – తౌక్టే.. గడచిన 06 గంటల్లో గంటకు సుమారు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, ఈ రోజు – 16 మే, 2021 08.30 గంటలకు – తూర్పు మధ్య అరేబియా సముద్రం దగ్గర Lat 15.3 deg N,/Long 72.7 deg E వద్ద కేంద్రీకృతమైందని తెలిపింది. ఇది గోవా కి పశ్చిమ నైరుతి దిశగా 120 కి. మీ., ముంబై కు దక్షిణ దిశగా 420 కి. మీ, వెరావెల్ (గుజరాత్) కు దక్షిణ ఆగ్నేయ దిశగా 660 కి. మీ. ఇంకా, కరాచీ(పాకిస్తాన్) కి ఆగ్నేయంగా 810 కిమీ దూరంలో  ఉందని పేర్కొంది. ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి, గుజరాత్ తీరమును 17.05.21 తేదీన సాయంత్రం సమయంలో చేరి,  పోరు బందర్ – మహువా (భావ నగర్ జిల్లా) ప్రాంతాల మధ్య 18. 5. 21 తేదీ ఉదయం సమయంలో తీరాన్నీ దాటే అవకాశం ఉందని వెల్లడించింది. పలితంగా కొంకన్, ముంబయి తీర ప్రాంతాల్లో తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, కేరళలో తౌక్టే తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక తీర ప్రాంత గ్రామాలు భారీ వర్షాలు, సముద్రజలాలతో అతలాకుతలమవుతున్నాయి. జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

Read also : Cyclone : ఉప్పాడ సముద్రతీరంలో రోజుకోమార్పు.. నేడు వెనక్కివెళ్లిన బీచ్, నిన్న ఎరుపు, నీలం రంగులో దర్శనం

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ