AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custard Apple Farming: సీతాఫలం సాగుతో అధిక లాభాలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..

Custard Apple Farming: సీతాఫలం ఇతర పండ్ల కంటే కొంచెం భినంగా ఉంటుంది. ఇది తినడానికి చాలా తీపి, రుచికరమైన పండు. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.

Custard Apple Farming: సీతాఫలం సాగుతో అధిక లాభాలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..
Custard Apple
uppula Raju
|

Updated on: Oct 18, 2021 | 9:57 PM

Share

Custard Apple Farming: సీతాఫలం ఇతర పండ్ల కంటే కొంచెం భినంగా ఉంటుంది. ఇది తినడానికి చాలా తీపి, రుచికరమైన పండు. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి దీనిని జనాలు ఎక్కువగా ఇష్టపడుతారు. ఇది ప్రధానంగా కరువు ప్రాంతాలు, తేలికపాటి నేలల్లో సాగు చేస్తారు. ముఖ్యంగా శుష్క ప్రాంతాలు, బీడు భూములలో ఎక్కువగా పండిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామి పథకం కింద కూడా ఈ చెట్టను పెంచుతున్నారు. సీతాఫల్ సాగు శాస్త్రీయంగా కింది మార్గాల్లో చేయవచ్చు.

సీతాఫలం చాలా పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుంది. అయితే వేడి, పొడి వాతావరణంలో పండిన సీతాఫలం చాలా రుచిని కలిగి ఉంటుంది. అంతేకాదు అద్భుతమైన నాణ్యత కూడా ఉంటుంది. కరువు పీడిత ప్రాంతాలకు సీతాఫలం సాగు ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. సీతాఫలం ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, వివిధ రకాల నేలల్లో కూడా పెరుగుతుంది. అయితే ఆల్కలీన్ నేలల్లో ఈ పండ్ల చెట్లు పెరగవు. ఈ నేలలు వీటికి అనుకూలం కాదు.

ఆంధ్రప్రదేశ్‌లోని బాలానగర్ లేదా మముత్ జాతులు ఉత్పత్తి, నాణ్యత పరంగా మంచివిగా గుర్తించారు. వర్షాకాలం ప్రారంభమైనప్పుడు ఈ చెట్లను నాటాలి. ప్రతి మొక్కకు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కుళ్ళిన ఎరువు లేదా కంపోస్ట్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అలాగే మొదటి 3 సంవత్సరాలు ప్రతి మొక్కకు ఫలదీకరణం చేయాలి. 5 సంవత్సరాల తరువాత 5 నుంచి 7 చెంచాల ఆవు పేడ లేదా కంపోస్ట్ ఎరువు, 200 నుంచి 500 గ్రాముల యూరియాను అందించాలి. సీతాఫలం సహజంగా ఆకురాల్చే పండ్ల చెట్టు కాబట్టి నీరుగారిపోకుండా పెరుగుతుంది. సీతాఫలం పంటకు క్రమం తప్పకుండా నీరు అవసరం లేదు. స్వచ్ఛమైన వర్షపు నీటిపై కూడా మంచి దిగుబడిని సాధించవచ్చు. కానీ మొదటి 3 నుంచి 4 సంవత్సరాల వరకు చెట్టుకు నీరు పోస్తే మొక్క బలంగా ఎదుగుతుంది.

Viral Video: కత్తులతో భజరంగ్ దళ్ సభ్యుల డ్యాన్సులు.. చర్యలు తీసుకుంటామన్న పోలీసులు.. వీడియో వైరల్..

Pragya Jaiswal: ఆనందంలో తడిసి ముద్దవుతోన్న అందాల ప్రగ్యా.. ఇంతకీ ఈ బ్యూటీ సంతోషానికి కారణమేంటో తెలుసా?

India and Israel: భారత్-ఇజ్రాయిల్ మధ్య కోవిడ్ సర్టిఫికేట్ గుర్తింపుపై కుదిరిన ఒప్పందం