AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pragya Jaiswal: ఆనందంలో తడిసి ముద్దవుతోన్న అందాల ప్రగ్యా.. ఇంతకీ ఈ బ్యూటీ సంతోషానికి కారణమేంటో తెలుసా?

Pragya Jaiswal: 2015లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కంచె' చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌. ఈ సినిమాలో తన అందంతో పాటు నటనతోనూ..

Pragya Jaiswal: ఆనందంలో తడిసి ముద్దవుతోన్న అందాల ప్రగ్యా.. ఇంతకీ ఈ బ్యూటీ సంతోషానికి కారణమేంటో తెలుసా?
Pragya Instagram
Narender Vaitla
|

Updated on: Oct 18, 2021 | 9:45 PM

Share

Pragya Jaiswal: 2015లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచె’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌. ఈ సినిమాలో తన అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుందీ బ్యూటీ. అనంతరం పలు వరుస అవకాశాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే తాజాగా బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ‘అఖండ’ మూవీతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ప్రగ్యా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒకసారి కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్రగ్యాకు రెండో సారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ప్రగ్యా సోషల్‌ మీడియా వేదికగా స్వయంగా తెలిపింది.

ఈ క్రమంలోనే హోం ఐసోలేషన్‌లో ఉన్న ఈ చిన్నది చికిత్స తీసుకుందీ అందాల తార. అయితే ఐసోలేషన్‌లో ఉన్న కూడా సోషల్‌ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంది ప్రగ్యా. ఈ క్రమంలోనే తన ఆరోగ్య వివరాలను అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అందాల తార కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. ఇటీవల కరోనా పరీక్ష నిర్వహించడంతో ప్రగ్యాకు నెగిటివ్‌గా తేలింది.

ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న ఈ బ్యూటీ తన సంతోషాన్ని బయటపెట్టింది. తెల్లని పొట్టి గౌనులో, చిరు నవ్వులు చిందిస్తోన్న సమయంలో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘నెగిటివ్‌.. ఈ పదం ఇంతకుముందెప్పుడూ నాకు ఇలా సంతోషాన్ని ఇవ్వలేదు’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఇక ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.

Also Read: T20 World Cup: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేయలేం.. తేల్చిచెప్పిన బీసీసీఐ..

Uttarakhand Rains: ఎక్కడివారు అక్కడే ఉండండి.. యాత్రికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెచ్చరిక..

Moto E40: భారత మార్కెట్లోకి మోటో కొత్త ఫోన్‌ వచ్చేసింది.. రూ. 10 వేలలోపే అద్భుతమైన ఫీచర్లు..