Curly hair: మీది ఉంగరాల జుట్టా.. అయితే తిరుగులేదు పో…

ఉంగరాల జుట్టు గూడు పుఠాణీ తెలిస్తే..సూర్యుడినే ఢీ కొట్టొచ్చు.. ఎండాకాలం వస్తే మాడు పగులుతుందని భయపడిపోతాం..కాసేపు ఎండలో బయటకు వెళ్లాలంటేనే అల్లాడిపోతాం.. 40 డిగ్రీల ఉష్ణోగ్రతకే ఉసూరుమంటాం..అదే రింగుల జుట్టు ఉంటే.. ఇంకో మూడు పాయింట్లు పెంచినా.. 45 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటినా నో ప్రాబ్లమ్‌.. పైగా గిరజాల జుట్టు మీ బ్రెయిన్‌ను కూల్‌గా ఉంచుతుందట..ఏంటీ నమ్మడం లేదా..?

Curly hair:  మీది ఉంగరాల జుట్టా.. అయితే తిరుగులేదు పో...
Curly Hair Men
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 14, 2023 | 9:08 PM

కొంతమంది సినిమా స్టార్స్..మోడల్స్‌, స్టూడెంట్స్‌ ఉంగరాల జుట్టుతో కనిపిస్తుంటారు. నలుగురిలో స్పెషల్‌గా మెరుస్తుంటారు. అది స్టైల్‌ కోసం అలా ఉండొచ్చు. ఇంకేదైనా కారణం కావచ్చు. ఆఫ్రికాలో మాత్రం 90 శాతం పైగా కర్లింగ్‌ హెయిర్స్‌తో కనిపిస్తారు. ఇదేం వాళ్ల స్టైల్‌ కాదు..వాళ్ల ఆచారమూ కాదు..ప్యాషన్‌ అంతకంటే కాదు..కానీ మానవ పరిణామ క్రమానికి బీజం పుట్టిందే అక్కడ..అప్పటి నుంచే ఉంగరాల జుట్టు మెయిన్‌టైన్‌ చేస్తున్నారు. అందుకు బలమైన కారణం ఉంది.

రింగుల జుట్టు శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మానవ మెదడు ఎదగడానికి తోడ్పడుతుంది. ఆఫ్రికా ఖండంతో పోల్చితే మనకు సూర్యతాపం తక్కువే..అదేంటి మాడు పగిలిపోతుంటే అంటారా..మరి దీనికే షాకైతే..కోట్ల సంవత్సరాల నుంచీ ఆఫ్రికన్లు ఏమనాలి.. సూర్యుడిని ఎంతలా తిట్టుకోవాలి..సూర్యతాపాన్ని ఎలా తట్టుకోవాలి.. వాళ్ల ముందు మనం జుజుబి..భగభగమండే సూర్యుడి నుంచి కిరణాలు నేరుగా నెత్తిమీద పడుతాయి. ఆ వేడికి మనం తట్టుకోలేము. కానీ కర్లింగ్‌ హెయిర్‌ ఉన్నవాళ్లపై సూర్యకిరణాల ప్రభావం అంతగా ఉండదంట. పైగా గిరజాల జుట్టు వల్ల మెదడు కూల్‌గా ఉంటుందని అమెరికాలోని పెన్‌స్టేట్‌ ఇవాన్‌ పగ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్

గిరజాల జుట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఆఫ్రికన్లు ఎందుకు గిరజాల జుట్టుతో ఉంటారు. తరతరాలుగా దాన్నే ఎందుకు కొనసాగిస్తున్నారు. అసలు ఈ జుట్టు వల్ల కలిగే లాభనష్టాలేంటి అన్నదానిపై విస్తృత పరిశోధనలు చేశారు. కృత్రిమంగా సౌరశక్తిని కర్లింగ్‌ జుట్టుపై పడేలా చేసి..బాడీ టెంపరేచర్‌..బ్రెయిన్‌ కండీషన్‌..స్కిన్‌ సిచ్యుయేషన్‌..టెస్ట్‌ చేశారు. రిజల్ట్ చూసి వాళ్లే షాకయ్యారు. పెన్‌స్టేట్‌ యూనివర్సిటీతో పాటు.. UKలోని లాఫ్‌బరో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కూడా ఉంగరాల జుట్టు వల్ల బాడీ కూల్‌గా ఉంటుందని..కర్లింగ్‌ హెయిర్‌ సోలార్‌ రేడియేషన్‌ నుంచి శరీరాన్ని కాపాడుతాయని చెబుతున్నారు.

ఉంగరాల జుట్టు అల్లికలను భారతీయులు ఎక్కువగా ఇష్టపడరు. చాలామంది జడ అల్లుకోవడం..పోనీ టైల్‌ వేసుకోవడం..లూజ్‌ హెయిర్‌ వదిలేయడం లాంటివి చేస్తుంటారు. కానీ ఆఫ్రికన్లు విపరీతమైన కర్లింగ్‌ హెయిర్‌ మెయిన్‌టైన్‌ చేస్తుంటారు. దీని వల్ల మన కంటే వాళ్లే ఆరోగ్యంగా కూడా ఉన్నట్లు సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. ప్రపంచంలో 60 శాతం జనాభా ఉంగరాల జుట్టుతో సూర్యతాపాన్ని అదుపు చేస్తున్నారు. కర్లింగ్‌ హెయిర్‌ బాడీని సేఫ్‌గా ఉంచేందుకు ఆరాలా పని చేస్తుందట.

నియాండర్‌ తల్ దగ్గరి నుంచి మానవ మనుగడ మొదలైన ఆఫ్రికా ఖండంలో విపరీతమైన ఎండ..ఇప్పట్లా అప్పుడు వాళ్లకు చల్లదనం పంచే ఏసీలు లేవు. జుట్టును జడ వేసుకోవాలని కూడా తెలియదు. అసలు హెయిర్‌ కట్‌ కూడా ఉండేది కాదు. బతికినంతకాలం ఎంత జుట్టు పెరిగితే అంత..జీవ పరిణామ క్రమంలో ఎన్నో మార్పులొచ్చాయి. కానీ జుట్టు ముడివేయడం మాత్రం మారలేదు. కాకపోతే వాళ్లకు పుట్టుకతోనే కర్లింగ్‌ హెయిర్ రావడం..వాటిని ముడులు ముడులుగా వేయడం అలవాటైంది..అదే నేటికీ కొనసాగుతోంది. నాటి మానవులకు మెదడు చిన్నగా ఉండేది. ఉంగరాల జుట్టు..ఎండనుంచి కాపాడుతూ కవచంలా ఉండటం వల్ల..మెదడు నిర్మాణం కూడా పెరిగిందని సైంటిస్టుల అభిప్రాయం..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!