CTET Results Out: విడుదలైన ‘సీ టెట్’ పరీక్ష ఫలితాలు.. అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలివే..
CTET Results: కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (C TET) పరీక్ష జనవరి 31న జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను సీబీఎస్సీ ప్రకటించింది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు విద్యను బోధించే టీచర్ల కోసం..
CTET Exam Results Out: కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (C TET) పరీక్ష జనవరి 31న జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను సీబీఎస్సీ ప్రకటించింది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు విద్యను బోధించే టీచర్ల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. మొదటి పేపర్‌లో 4,15,798 మంది, రెండవ పేపర్‌లో 2,39,501 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. జనవరి 31న నిర్వహించిన ఈ పరీక్షకు పేపర్ 1 కోసం 16,11,423 మంది పేపర్ 2 కోసం 14,47,551 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా.. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, టిబెటన్ పాఠశాలలు, ఇతర అన్‌ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలతోపాటు టెట్ నిర్వహించని రాష్ట్రాల్లోని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులుగా పనిచేయవచ్చనే విషయం తెలిసిందే. సీటెట్ పరీక్ష రెండు పేపర్లలో జరిగింది. మొదటి పేపర్‌లో మొత్తం 150 మార్కులకు పరీక్షను నిర్వహించారు. ఇందులో మొత్తం 5 విభాగులుంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. ఇక రెండో పేపర్ విషయానికొస్తే.. మొత్తం 150 మార్కులకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు..
* సీటెట్ అర్హత వ్యాలిడిటీ జారీ చేసిన నాటి నుంచి ఏడేళ్లు ఉంటుందని సీబీఎస్‌ఈ చెప్పింది.
* పరీక్షకు హాజరైన వారి మార్క్ షీట్లు డీజీ లాకర్‌లో ఉంటాయి.
* అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్లను డిజీ లాకర్‌లో అప్‌లోడ్ చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులకు లాగిన్ వివరాలను తమ మొబైల్ ఫోన్లకు పంపిస్తారు.
* సీటెట్ మార్కషీట్, అర్హత సాధించిన సర్టిఫికేట్లకు భద్రత విషయమై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్యూఆర్ కోడ్‌ను డిజీ లాకర్ మొబైల్ యాప్ ద్వారా వెరిఫై చేసుకొవచ్చని సీబీఎస్‌ఈ తెలిపింది.
* సీటెట్ అర్హత పరీక్షకు అభ్యర్థి ఎన్నిసార్లైనా హాజరుకావొచ్చు దీనికి ఎలాంటి పరిమితి లేదు. పరీక్షలో అర్హత సాధించిన వారు కూడా మార్కులు పెంచుకునేందుకు మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పించారు.
* సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ పరీక్షకు సంబంధించిన ఓఎమ్‌ఆర్ షీట్‌లను ఫలితాల విడుదల తర్వాత సుమారు రెండు నెలల వరకు అందుబాటులో ఉంచుతారు.
ఫలితాలు ఎలా తెలుసుకోవాలంటే..
* ముందుగా అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inలోకి వెళ్లాలి.
* అనంతరం ‘CTET January 2021 Results’పై క్లిక్ చేయాలి.
* తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
* అనంతరం ఓపెన్ అయిన కొత్త పేజీలో మీ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్‌ను ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ నొక్కాలి.
* వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై దర్శనమిస్తాయి.
* ప్రింట్ తీసుకుంటే తదుపరి అవసరాల కోసం ఉపయోగపడుతుంది.
#WATCH: రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రెప్పపాటులో కాపాడిన రైల్వే పోలీసులు.. వీడియో