Google Messages: మరో కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చిన గూగుల్ మెసెజెస్.. ‘షెడ్యుల్’తో ప్రయోజనాలేంటో తెలుసా.?
Google Messages New Feature: టెక్ కంపెనీలో మధ్య పోటీ తీవ్రంగా పెరుగుతుండడం యూజర్లకు పండగలా మారుతోందని చెప్పాలి. ఎందుకంటే టెక్ ప్రపంచంలో పోటీని తట్టుకునే క్రమంలోనే ఒక కంపెనీకి మించి మరో కంపెనీ..
Google Messages New Feature: టెక్ కంపెనీలో మధ్య పోటీ తీవ్రంగా పెరుగుతుండడం యూజర్లకు పండగలా మారుతోందని చెప్పాలి. ఎందుకంటే టెక్ ప్రపంచంలో పోటీని తట్టుకునే క్రమంలోనే ఒక కంపెనీకి మించి మరో కంపెనీ కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. ఇందులో ముందు వరుసలో నిలుస్తోంది టెక్ దిగ్గజం గూగుల్. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంది కాబట్టే గూగుల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆ రేంజ్‌లో ఆదరణ ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే గూగుల్ తాజాగా మరో కొత్త ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికే.. వీడియో కాలింగ్, లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోన్న గూగుల్ తాజాగా ‘షెడ్యూల్’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్ ఉపయోగమేంటనేగా మీ సందేహం.. ఉదాహరణకు మీరు ఎవరికైనా పుట్టిన రోజు లేదా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటారు. కానీ సమయానికి మర్చిపోతారేమోననే అనుమానం ఉంది. అలాంటి సమయంలోనే ఈ ‘షెడ్యూల్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. గూగుల్ మెసేజేస్‌లో షెడ్యూల్ అనే ఫీచర్ ద్వారా మీరు ఎవరికి మెసేజ్ పంపాలో ముందుగానే సెట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ మెసేజ్ లేటెస్ట్ వెర్షన్ (7.4.050 )ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక షెడ్యూల్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా మీరు పంపాలనుకుంటున్న మెసేజ్‌ను టైప్ చేయాలి. అనంతరం.. సెండ్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయాలి. దీంతో మీకు తేదీలు, సమయం చూపిస్తూ ఒక పాప్ అప్ మెసేజ్ వస్తుంది. అందులో నుంచి మీరు కోరుకున్న తేదీని సమయాన్ని ఎంచుకొని సేవ్ చేస్తే సరిపోతుంది. మీరు ఎవరికైతే మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారికి కోరుకున్న సమయానికి వెళ్లిపోతుంది. ఈ ఆప్షన్ ద్వారా కేవలం టెస్ట్స్ మెసేజ్‌లే కాకుండా వీడియోలు, ఫొటోలు కూడా పంపించుకోవచ్చు. భలే ఉంది కదూ ఈ కొత్త ఫీచర్.. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కొత్త ఫీచర్‌పై ఓ లుక్కేయండి.