ఆ బస్టాప్‏లో ఉన్నది దెయ్యమా.. లేక మనిషేనా.. కానీ ఆ లైన్.. ఇంటర్నెట్‌ని హడలెత్తిస్తోన్న ఫోటో…

ప్రస్తుత డిజిటల్ కాలంలోనూ దెయ్యాలు, భూతాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ఇక మన భారత్‏లో మూడనమ్మకాలు,

ఆ బస్టాప్‏లో ఉన్నది దెయ్యమా.. లేక మనిషేనా.. కానీ ఆ లైన్.. ఇంటర్నెట్‌ని హడలెత్తిస్తోన్న ఫోటో...
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 21, 2021 | 2:29 PM

ప్రస్తుత డిజిటల్ కాలంలోనూ దెయ్యాలు, భూతాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ఇక మన భారత్‏లో మూడనమ్మకాలు, దెయ్యాలను విశ్యాసించడమే కాదు.. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఇక కొన్ని వీడియోలు చూడాలంటే భయంతో వణికిపోతుంటారు. కానీ మనకు నెట్టింట్లో కనిపించే వీడియోలన్నీ కూడా ఎదో యాప్ లో క్రియేట్ చేయడం లేదా ట్రిక్స్ ఉపయోగించి క్రియేట్ చేసిన వీడియోలే. అలాగే అక్కడ దెయ్యం ఉంది అంటూ దెయ్యాల ఫోటోలు నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. నిజంగానే దెయ్యాలు ఉన్నాయా అనే అనుమానం కలిగేంతగా ఆ ఫోటోలను మార్చేస్తుంటారు. తాజాగా అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఉన్న మహిల దెయ్యం అని కొందరు అంటే.. కాదు కావాలనే అలా క్రియేట్ చేశారని మరికొందరు అంటూన్నారు. మరీ అదెంటో చూద్దామా.

క్రొయేషియాకు చెందిన ఇవాన్ రుబిల్ టూర్ గైడ్. అలాగే ఇతడికి ఫోటోలు తీయడం కూడా ఆసక్తి. తనకు నచ్చిన ప్రదేశాలను కెమెరాలో బందిస్తుంటాడు.. అయితే కొద్ది రోజుల క్రితం జాగ్రేబ్ బస్టాప్ వద్ద నిల్చున్న ప్రయాణికులను తన ఫోన్ కెమెరాతో ఫోటో తీశాడు. అందులో దీనిలో ఇద్దరు నన్‌లు, బ్రౌన్‌ కలర్‌ కోటు ధరించిన ఓ మహిళ ఉన్నారు. ఇక ఈ ఫోటోని పరిశీలనగా చూస్తే.. అందులో బ్రౌన్ కోటు వేసుకున్న మహిళ కాళ్లు మాత్రం కాస్త భిన్నంగా ఉన్నాయి. అందులో ఆమె కాళ్లు పారదర్శకంగా ఉన్నాయి. బస్టాప్‌లో ఉన్న తెల్ల గీత సైతం ఆమె కాళ్ల నుంచి వెళ్లినట్లు కనిపిస్తోంది. దాంతో ఇవాన్ ఆ ఫొటోను రెండు మూడుసార్లు పరిశీలనగా చూశాడు. ఈ ఫొటోను అతడి స్నేహితులకు షేర్ చేశాడట. వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు మాత్రం ‘‘అది నీ కెమేరా ట్రిక్ కాబోలు’’ అని కొట్టిపడేశారట. అనంతరం ఆ ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్టు చేశాడు ఇవాన్‌. దీంతో ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇది చూసిన కొందరు నీ ఫోటోలో దెయ్యం ఉంది అంటే.. చాలా మంది నీ కెమేరాలో ఏదో సమస్య ఉంది చెక చేసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే విషయమై.. ఇవాన్ మాట్లాడుతూ.. నా ఫోన్ కెమేరాలో ఏదైనా సమస్య ఉందేమోనని అనుకోని మిగతా ఫోటోలను చూశాను. కానీ అది మాత్రమే అలా వచ్చింది. కానీ మీరు చెప్పెది నిజమేనేమో నా ఫోన్ కెమెరాలోనే ప్రాబ్లమ్ ఉంది అని చెప్పుకోచ్చాడు.

Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే..