కళ్ళకే కాదు.. చర్మంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తోన్న స్మార్ట్ ఫోన్స్.. సూచిస్తున్న నిపుణులు..

కళ్ళకే కాదు.. చర్మంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తోన్న స్మార్ట్ ఫోన్స్.. సూచిస్తున్న నిపుణులు..
Smartphone

కరోనా ప్రభావంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఫోన్స్, ల్యాప్ టాప్స్ వాడకం మరింత పెరిగిపోయింది. వర్క్ ఫ్రం హోం విధానంతో వీటి వాడకం మరింత ఎక్కువైంది.

Rajitha Chanti

|

Apr 21, 2021 | 2:58 PM

కరోనా ప్రభావంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఫోన్స్, ల్యాప్ టాప్స్ వాడకం మరింత పెరిగిపోయింది. వర్క్ ఫ్రం హోం విధానంతో వీటి వాడకం మరింత ఎక్కువైంది. వీటి వలన బుద్దిహీనంగా మారడమే కాకుండా.. మానవ సంబంధాల మీద మీటి ప్రభావం చూపిస్తున్నాయని ఓ అధ్యయనంలో బయటపడింది. భారతీయ సాంకేతిక పరిశోధన సంస్థ నిర్వహించిన ఓ పరిశోదనలో 2019 నుంచి 2020 వరకు వీటి వాడకంలో 11 శాతం పెరిగినట్లుగా తెలీంది. ఇక స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా చూడడం వలన కళ్ళు, తలనొప్పి, వీపు, మెడ సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఫోన్ లైట్ వలన వెలువడే బ్లూ లైట్ చర్మంపై కూడా ప్రభావం చూపిస్తుంది. బ్లూ లైట్ లేదా హై ఎనర్జీ విజువల్ లైట్ (హెచ్‌ఇవి) అనేది వైలెట్ / బ్లూ బ్యాండ్‌విడ్త్‌లో అధిక ఫ్రిక్వెన్సీని కలిగి ఉంటాయని.. అలాగే స్వల్ప వెవ్స్ లైట్ (400-500nm) ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్స్, ఎల్ఈడీ స్క్రీన్స్, ఫ్లోరోసెంట్, ఎల్ఈడీ బల్బులు వాటివల్ల వెలుతురు ఏర్పడుతుందని అని డాక్టర్ కరిష్మా సౌందర్య వాటాల వద్ద కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ కరిష్మా కగోడు వివరించారు.

“UVA / UVB కాంతితో పోలిస్తే బ్లూ లైట్ చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది, అందువల్ల UVA / UVB కాంతితో పోలిస్తే వర్ణద్రవ్యాన్ని ప్రేరేపించడంలో ఇది మరింత చురుకుగా ఉంటుంది (ఎక్స్పోజర్ ఎక్కువ కాలం ఉంటే)” అని డాక్టర్ కగోడు హెచ్చరించారు. ఈ బ్లూ లైట్ వలన వృద్దాప్య చాయలు ముందుగానే ఏర్పడతాయి. కాంతి లేదా UVA / UVB రేడియేషన్లకు గురికావడం చర్మంపై నీలిరంగు కాంతి మూడు గంటలు ఉండడం వలన చర్మానికి హాని కలుగుతుంది.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Vanity Wagon (@vanitywagon)

Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

Ayushman Card: ఫ్రీగా ఆయుష్మాన్ కార్డు.. తీసుకున్నవారికి రూ.5 లక్షల బెనిఫిట్.. ఆ తేదీ వరకే ఛాన్స్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu