Cisco Survey: సెలవుల్లో ఎలా గడుపుతారో తెలుసా? సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ప్రస్తుతం నడిచేది యాంత్రిక యుగం. ప్రతి ఒక్కరూ డిజిటల్ వ్యవహారాల్లో తలమునకలై ఉంటారు. అందులో ముఖ్యంగా సాఫ్ట్ వేర్ వాళ్లు ప్రథమ స్థానంలో ఉంటే.. రెండవ స్థానంలో మీడియా రంగం వారు ఉంటారు. ఆ తరువాత స్థానాల్లో మిగిలిన సేవలకు సంబంధించిన ఉద్యోగులు ఉంటారు. వీరికి సెలవులు ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు.
ప్రస్తుతం నడిచేది యాంత్రిక యుగం. ప్రతి ఒక్కరూ డిజిటల్ వ్యవహారాల్లో తలమునకలై ఉంటారు. అందులో ముఖ్యంగా సాఫ్ట్ వేర్ వాళ్లు ప్రథమ స్థానంలో ఉంటే.. రెండవ స్థానంలో మీడియా రంగం వారు ఉంటారు. ఆ తరువాత స్థానాల్లో మిగిలిన సేవలకు సంబంధించిన ఉద్యోగులు ఉంటారు. వీరికి సెలవులు ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా సెలవులు దొరికితే చాలు ఇలా బయట తిరిగేందుకో, ఇంట్లోవాళ్లతో గడిపేందుకో, షాపింగ్, సినిమా అంటూ తెగ సందడి చేస్తూ ఉంటారు. పైగా ప్రస్తుతం ప్రపంచమంతా క్రిస్మస్ సందడి నెలకొంది. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులకు వారం రోజులకు పైగా సెలవులు ప్రకటిస్తాయి ప్రముఖ ఎంఎన్సీ (MNC) కంపెనీలు. ఈ సెలవుల్లో తమ ఉద్యోగస్తులు ఎలా గడుపుతారన్నదానిపై ఒక సర్వే నిర్వహించింది. అందులో ఆసక్తికమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రముఖ టెక్నాలజీ సంస్థ అయిన సిస్కో ప్రపంచ వ్యాప్తంగా సెలవులను వినియోగించేకునే వారిపై ఒక సర్వే నిర్వహించింది. ఇందులో యూఎస్, యూకే, యూఏఈ, జర్మనీ, భారత్ తోపాటూ వివిధ దేశాల్లోని 12 వేల మంది ఇందులో పాల్గొన్నారు. వీరందరూ సెలవుల్లో ఎలా గడుపుతారంటే.. అనేక రకాల ఆన్లైన్ యాప్ లను, బ్యాంకింగ్ సేవలను, కంప్యూటర్ గేమింగ్, సినిమా, వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ మాధ్యమాలు, బంధువులతో వీడియో కాల్స్ మాట్లాడటం లాంటి కార్యకలాపాల్లో ఎక్కువ శాతం గడుపుతున్నట్లు తెలుస్తోంది. భారతీయులు 85 శాతం మంది గలా గుపుతూ ఉండటం గమనార్హం.
సిస్కో యాప్ డైనమిక్ షాపింగ్ పల్స్ సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. అధిక శాతం మంది ప్రజలు అనేక రకాల గేమ్స్, ఆన్లైన్ పేమెంట్స్, బ్యాంకింగ్, ఈ కామర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే ఓటీటీ వేదికలు, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ షోలు, స్పోర్ట్స్, మ్యూజిక్ వంటి అప్లికేషన్లను కూడా వినియోగించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో కంటే కూడా సెలవు రోజుల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది సిస్కో సర్వే. ఈ మాథ్యమాలను వినియోగించుకుంటున్న వారు 88 శాతం మందిగా గుర్తించారు.
అలాగే 72 శాతం మంది అలెక్సా, స్మార్ట్ హోమ్ వంటి ఇంటర్నెట్‌తో అనుసంధానించిన పరికరాలను వినియోగించాలని, 60 శాతం మంది గేమింగ్ యాప్‌లను ఉపయోగించాలని భావిస్తున్నాట్లు సిస్కో నివేదికలో పొందుపరిచింది. ఇక 84 శాతం మంది అయితే స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపాలని వీడియో కాల్స్, సామాజిక మాధ్యమాలను ఎంపిక చేసుకుంటున్నారు. 75 శాతం మంది వివిధ రకాల వంటకాలు, వాటి రెసిపీలను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇక అసలైన అంశం ఏమిటంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లను 88 శాతం మంది వినియోగించుకుంటున్నట్లు సిస్కో సర్వే తన నివేదికలో పొందుపరిచింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..