Yaganti Basavayya: బ్రహ్మం గారు చెప్పినట్లు నానాటికి పెరుగుతున్న యాగంటి బసవయ్య సైజు.
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఎర్రమల కొండల్లో ప్రకృతి రమణీయతల మధ్య యాగంటి క్షేత్రం కొలువై ఉంది. కార్తీక మాసంలో యాగంటి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తుంటారు. యాగంటి దేవాలయంలో ఉన్న నందీశ్వరునికి ఓ ప్రత్యేకత ఉంది ఆలయంలో ఈశాన్య భాగంలో నందీశ్వరుడు కొలువై ఉండడం.. ఆ నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత.. పురావస్తు శాఖ అంచనా ప్రకారం ఈ నంది విగ్రహం..
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఎర్రమల కొండల్లో ప్రకృతి రమణీయతల మధ్య యాగంటి క్షేత్రం కొలువై ఉంది. కార్తీక మాసంలో యాగంటి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తుంటారు. యాగంటి దేవాలయంలో ఉన్న నందీశ్వరునికి ఓ ప్రత్యేకత ఉంది ఆలయంలో ఈశాన్య భాగంలో నందీశ్వరుడు కొలువై ఉండడం. ఆ నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత.. పురావస్తు శాఖ అంచనా ప్రకారం ఈ నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతూ వస్తోంది. అంతేకాదు.. 90 సంవత్సరాల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారట, ఇప్పుడు అది పెరిగిపోవడంతో ప్రదక్షిణాలకు స్థలం పూర్తిగా తగ్గడం.. దీంతో నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలు పడడం లేదు.
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య ప్రస్తావన తీసుకొచ్చారు. అంతకంతకూ పెరిగి రంకె వేస్తుందనీ కలియుగం అంతమవుతుందనీ రాశారు. భవిష్యత్‌లో ఇదే జరగనుందనీ ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం సంఘమ వంశానికి చెందిన రాజు హరిహర బుక్కరాయ నిర్మించారని చరిత్రకారులు అంచనా వేశారు. యాగంటి క్షేత్రం ఉనికి పురాతన కాలం నుండి ఉందని భక్తుల నమ్మకం అపర శివ భక్తుడైన భృగు మహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశారని ఫలితంగా సతీ సమేతంగా ఇక్కడ శివుడు కొలువయ్యారని ఒక కథనం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.