Farmers Protest: రైతు గోడు పట్టని అధికారులు.. అన్నదాతలు పడుతున్న కష్టాలకు ఈ చిత్రమే తార్కాణం..
చినుకు జాడ కనిపించదు.. కలిసిరాని కాలం.. దానికి తోడు అధికారుల నిర్లక్ష్యం.. చేసేదీలేక రోడ్డెక్కారు రైతులు. సాగునీటి కోసం తాము చేస్తున్న న్యాయమైన పోరాటానికి సహకరించాలంటూ ఓ అన్నదాత సీఐ కాళ్లు పట్టుకున్నాడు. అనంతపురం జిల్లా విడపనకల్లులో ఈ ఘటన చేసుకుంది. అనంతపురం జిల్లాలో మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు.
చినుకు జాడ కనిపించదు.. కలిసిరాని కాలం.. దానికి తోడు అధికారుల నిర్లక్ష్యం.. చేసేదీలేక రోడ్డెక్కారు రైతులు. సాగునీటి కోసం తాము చేస్తున్న న్యాయమైన పోరాటానికి సహకరించాలంటూ ఓ అన్నదాత సీఐ కాళ్లు పట్టుకున్నాడు. అనంతపురం జిల్లా విడపనకల్లులో ఈ ఘటన చేసుకుంది. అనంతపురం జిల్లాలో మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట నీరు లేక ఎండిపోతుండడం చూసి అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. విడపనకల్లు మండలంలో జి.బి.సి.కెనాల్ కింద వేలాది ఎకరాలలో రైతులు మిర్చి పంటను సాగు చేశారు. పంట ఎదుగుతున్న సమయంలోనే అసలు కష్టాలు మొదలయ్యాయి.
పంట బాగానే ఉంది. సరిగ్గా కాయలు కాసే సమయానికి తుంగభద్ర జలాశయం నుండి జి.బి.సి. కెనాల్ కు వచ్చే నీరు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు అన్నదాతలు. ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద నుండి హంద్రీనీవా ద్వారా జి.బి.సికెనాల్ లోకి నీరు విడుదల చేయాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా ద్వారా నీటిని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌లోకి వదిలితే, ఆ నీటితో తమ పంటను కొద్ది వరకు అయినా కాపాడుకుంటామని అధికారులను వేడుకున్నారు. రైతన్నల గోడు పట్టని అధికారులు స్పందించకపోవడంతో విడపనకల్ మండలంలో రైతులు ఆందోళనకు దిగారు.
విడపనకల్ మండల కేంద్రంలోని ఎన్ హెచ్ 42 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు అన్నదాతలు. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద అన్నదాతలు చేపట్టిన ఆందోళనను విరమించాలని పోలీసులు కోరారు. అయితే నీటిని విడుదల చేయాలని కోరుతూ పోరాటం చేస్తున్న తమకు సహకరించాలంటూ ఉరవకొండ సీఐ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకోవడంతో పోలీసులే చలించిపోయారు. అన్నదాతలు పడుతున్న కష్టాలకు ఈ చిత్రమే తార్కాణంగా నిలిచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…