Weekly Horoscope: వారికి ఆకస్మిక ధనలాభం.. వీరికి శుభ వార్తలు.. 12 రాశుల వార ఫలాలు (డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 23 వరకు)

వార ఫలాలు (డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 23, 2023 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారికి మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope: వారికి ఆకస్మిక ధనలాభం.. వీరికి శుభ వార్తలు.. 12 రాశుల వార ఫలాలు (డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 23 వరకు)
Weekly Horoscope 17 23 Dece
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Dec 17, 2023 | 7:58 AM

వార ఫలాలు (డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 23, 2023 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారికి మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)..

ఈ వారమంతా దాదాపు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అప్పగించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగు తాయి. కొద్దిగా ప్రయత్నిస్తే పనులన్నీ సంతృప్తికరంగా, సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక, ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుకుంటారు. లాట రీలు, షేర్లు, జూదాలు, వడ్డీ వ్యాపారాలు, స్పెక్యులేషన్ వంటివి బాగా అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి. భరణి నక్షత్రం వారు ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యానికి ఢోకా లేదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)..

ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. అధికారుల నుంచి మంచి గుర్తింపు లభి స్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలతో ముందుకు వెడతారు. జీవిత విధానాన్ని మార్చుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. తలపెట్టిన పనుల న్నిటీనీ నిదానంగా, ఓపికగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితులలో కొందరు పక్కదోవ పట్టించే సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి రోహిణి నక్షత్రం వారికి శుభవార్తలు అందు తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)..

ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ వారమంతా సమయం అనుకూలంగా ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. పునర్వసు నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది. బంధువుల రాకతో కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఆర్థిక పరిస్థితికి సంబంధించినంత వరకూ ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇతరుల కార్యకలాపాలకు ఇతోధికంగా సహాయ సహకారాలు అందజేస్తారు. అయితే, సొంత పనుల మీద కూడా శ్రద్ధ పెట్టడం అవసరం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)..

వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. అధికారులు బాగా ఉపయోగించుకుంటారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. భవిష్యత్తుకు ఉపయోగపడగల పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో పెద్దగా లాభాలు రాకపోవచ్చు కానీ, నష్టాలు వచ్చే అవకాశం మాత్రం లేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొందరు మిత్రులకు సహాయం చేయాల్సిన అవసరం వస్తుంది. తండ్రి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ప్రత్యర్థులు, శత్రువుల బెడద తగ్గు తుంది. ఇతరులకు కొద్దిగా అండగా నిలబడడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)..

ఈ వారమంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు సాధారణంగా సాగి పోతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. తలపెట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అపార్థాలు తొలగించుకోవడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. రావలసిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరుతాయి. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ముఖ్య మైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. పుబ్బా నక్షత్రం వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)..

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ ఉంటుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. అయితే, ఏ పని చేసినా, ఏ ప్రయత్నం తలపెట్టినా వ్యయ ప్రయాస లుండే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి కానీ, దైవ కార్యాల మీదా, శుభ కార్యాల మీదా ఖర్చు పెరిగే సూచన లున్నాయి. వ్యాపారం మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. పిల్లలు చదువుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందే అవకాశం ఉంది. గట్టి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఉప యోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)..

ఉద్యోగంలో మీ పని తీరు మరింతగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. మొత్తం మీద ఆదాయ, ఆరోగ్య ఇబ్బందులేవీ లేకుండా ఈ వారం ప్రశాంతంగా గడిచిపోతుంది. పిల్లలు గానీ, కుటుంబ సభ్యులు గానీ దూర ప్రాంతం నుంచి ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. జీవిత భాగస్వామితో కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదాన్ని పరి ష్కరించుకోవడానికి కూడా సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొందరు మిత్రుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం అవసరం. స్వాతి, విశాఖ నక్షత్రాలవారికి వృత్తి, ఉద్యోగాలపరంగా అదృష్టం పడు తుంది. తల్లితండ్రుల అండదండలు లభిస్తాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరు తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)..

వృత్తి, వ్యాపారాల్లో బాగా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. అయితే, శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. ఉద్యోగంలో కూడా ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆశిం చినఉద్యోగం లభించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రు లకు ఆర్థిక సహాయం చేస్తారు. పిల్లలు కొద్ది శ్రమతో చదువుల్లో పురోగతి సాధిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలనన్నిటినీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అనూరాధ నక్షత్రం వారికి మనసులోని కోరికలు నెరవేరు తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)..

వారమంతా దాదాపు ప్రశాంతంగా గడిచిపోతుంది. అందులోనూ పూర్వాషాఢ నక్షత్రం వారికి మరింత సానుకూలంగా చక్కగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. జీత భత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరిగిన ప్పటికీ, ఆశించిన దాని కంటే ఎక్కువగా ప్రతిఫలం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది చాలావరకు అనుకూల సమయం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవ సరం ఉంది. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. సతీమణితో అపార్థాలు తొలగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)..

దాదాపు అన్ని రంగాల వారికీ సమయం అనుకూలంగా ఉంది. సానుకూల దృక్పథంతో వ్యవహ రించడం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యంగా వృత్తి జీవితంలో బిజీ అయిపోవడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారప డడం జరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. ఆర్థిక పరి స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)..

వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత పనులలో కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. ఆర్థిక వ్యవ హారాలు పరవాలేదని పిస్తాయి. వృథా ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. నిరుద్యోగులకు స్వల్ప ప్రయ త్నంతో మంచి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది. పూర్వాభాద్ర వారికి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)..

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఈ రాశిలోని ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. వీరికి ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో విహార యాత్ర చేసే సూచనలున్నాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండడం మంచిది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది.