Prakasam Barrage: మత్స సంపద పెంచేందుకు.. ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్‌లో 10 లక్షల చేప పిల్లల విడుదల
చేప పిల్లలను రిజర్వాయర్లో విడుదల చేయటం ద్వారా సహజంగా ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదకు తోడు విడుదల చేసిన చేపలు కూడా పెరిగి రిజర్వాయర్లోనూ, నదుల్లోనూ మత్స సంపద వృద్ధి అవుతుంది. తద్వారా మత్స్యకారులు దీని ద్వారా లాభం పొందనున్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లాకి 25.5 లక్షల చేప పిల్లలను కేంద్రం మంజూరు చేసింది. లబ్ధిదారుని వాటా కింద ప్రభుత్వం తణుకు, నరసాపురం, మోటూరు, పెనమలూరు లో ఉత్పత్తి చేసిన 15.30 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నారు.
మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది.. ఇందులో భాగంగా భవానిపురం ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేశారు అధికారులు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు రిజర్వాయర్లో మత్స్యసంపద ఉత్పత్తి , ఉత్పాదకత పెంచటానికి ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్ లో 10 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. ఇవే కాకుండా ఈ నెల 18న సూరయ్యపాలెంలో 5.7 లక్షల చేప పిల్లలను, ఇబ్రహీంపట్నంలో 9.8 లక్షల చేప పిల్లలను అధికారులు విడుదల చెయ్యనున్నారు.
ఇలా చేప పిల్లలను రిజర్వాయర్లో విడుదల చేయటం ద్వారా సహజంగా ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదకు తోడు విడుదల చేసిన చేపలు కూడా పెరిగి రిజర్వాయర్లోనూ, నదుల్లోనూ మత్స సంపద వృద్ధి అవుతుంది. తద్వారా మత్స్యకారులు దీని ద్వారా లాభం పొందనున్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లాకి 25.5 లక్షల చేప పిల్లలను కేంద్రం మంజూరు చేసింది. లబ్ధిదారుని వాటా కింద ప్రభుత్వం తణుకు, నరసాపురం, మోటూరు, పెనమలూరు లో ఉత్పత్తి చేసిన 15.30 లక్షల చేప పిల్లలను అలాగే ప్రైవేట్ సీడ్ ఫామ్ నుండి 10.20 లక్షల చేప పిల్లలను కొనుగోలు చేసి రిజర్వాయర్ లో విడుదల చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రకాశం బ్యారేజ్ లో ఉన్న తొమ్మిది మత్స్య సహకార సంఘాలకు చెందిన కుటుంబాలతో పాటు 860 లైసెన్స్ దారులు లబ్ధి పొందనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..