Children Overpraising: మీ పిల్లలను ఎక్కువగా ప్రశంసిస్తున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి..!

Children Overpraising: మీ పిల్లలను ఎక్కువగా ప్రశంసిస్తున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి..!

Children Overpraising: తల్లిదండ్రులు తరచుగా పిల్లలను ప్రశంసిస్తూ ఉంటారు. పిల్లలు చేసే కొన్ని పనుల్లో మెచ్చుకుంటుంటాము. అయితే పిల్లలను అతిగా ప్రశంసించడం..

Subhash Goud

|

Feb 14, 2022 | 9:28 PM

Children Overpraising: తల్లిదండ్రులు తరచుగా పిల్లలను ప్రశంసిస్తూ ఉంటారు. పిల్లలు చేసే కొన్ని పనుల్లో మెచ్చుకుంటుంటాము. అయితే పిల్లలను అతిగా ప్రశంసించడం వారి అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని చైల్డ్‌ సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ప్రశంసించడం పిల్లలకు ప్రాణాంతకమే కాకుండా వేధింపులకు గురయ్యేలా చేస్తుందని వెల్లడిస్తున్నారు. అతిగా పొగడ్తలు అందుకునే చిన్నారులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొవడంలో విఫలమవుతారంట. ఈ వాస్తవాలను బ్రిటన్‌లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడయ్యాయి. 4,500 మంది తల్లిదండ్రులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. యూనివర్సిటీ సోషల్ మొబిలిటీ డిపార్ట్‌మెంట్ ఎలియట్ మేజర్ ప్రకారం.. సర్వేలో పాల్గొన్న 85 శాతం మంది తల్లిదండ్రులు, తమ పిల్లలను అతిగా ప్రశంసించడం వలన వారి నేర్చుకోవడంపై ప్రతికూల ప్రభావితం చూపినట్లు తెలియదు. వాస్తవానికి చిన్నారుల్లో పొగడ్త వారిలో సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. అయితే, ఇదే సమయంలో అతిగా పొగడటం మాత్రం వారి అభివృద్ధి విషయంలో కొంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల ఎదుట సానుకూల విషయాలను మాట్లాడటం లేదా ప్రశంసిస్తేనే వారిలో సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతారు. కానీ అది వారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని గుర్తించలేకపోతున్నారు.

పిల్లలపై కన్నేసి ఉంచండి

పిల్లలను పొగడడం ముఖ్యమే. ప్రశంస ద్వారా పిల్లలకు కొత్త ఉత్సాహం అందుతుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రశంస పిల్లలకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల ఎదుగుదలకు ప్రశంసలు ఎంతో సహాయపడతాయి. స్కూల్లో వారి పెర్ఫార్మన్స్‌ మెరుగవుతుంది. తమపై తాము ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. దీనికి ఓ చిన్న పొగడ్త ఎంతో ఉపయోగపడుతుంది. అలా కాకుండా అతిగా పొగిడితే మాత్రం అది వారిపై దుష్ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. పిల్లల్ని ప్రశంసించే విషయంలో పరిమితులుంటాయి. ఆరోగ్యకరమైన ప్రశంసకు, అతిగా పొగడడానికి మధ్య ఉన్న బేధాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు మితిమీరిన ప్రశంసల వల్ల పిల్లలపై పడే దుష్ప్రభావం నుంచి వారిని కాపాడుకోవచ్చు. ఏదైనా పనిని సాధించడంలో పిల్లల కృషిని కచ్చితంగా ప్రశంసించి తీరాలి. వారి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలి. చిన్న చిన్న అంశాలకు వారిని ప్రశంసించడం మానండి. మీ ప్రశంస నిజాయితీగా ఉండాలి. సవాళ్ళను ఎదుర్కునే ధైర్యాన్ని పిల్లలకివ్వడం పిల్లలను ప్రశంసించడంలోనున్న ముఖ్య ఉద్దేశ్యం. పిల్లలను అతిగా పొగడడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. మీ ఆలోచనలకు అనుగుణంగా పిల్లలను తీర్చిదిద్దుకునేందుకు ప్రశంస ఓ సాధనంలా ఉపయోగపడుతుంది.

పిల్లల పనులకు చిన్న చిన్న బహుమతులు ఇవ్వాలే కానీ, వారు చేసే పనులని ఆధారంగా తీసుకుని జడ్జ్‌ చేయకండి. తల్లిదండ్రులు తరచూ వాడే ‘మంచి పని చేసావు’ అనే ప్రశంసపై ఎన్నో వాదనలు జరిగాయి. ‘మంచి పని’ అనేది జడ్జ్‌మెంట్‌గా మారుతుంది కాని ప్రశంసగా మాత్రం కాదు. ఇటువంటి మాటలు పిల్లల చిన్న చిన్న ఆనందాలని హరిస్తాయి. పిల్లలను అతిగా పొగడకూడదు లేదా ప్రశంసించకూడదు అనేందుకు ఇది ఒక కారణం. పిల్లలని అతిగా ప్రశంసించే ముందు ఆ ప్రశంస పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది అనే దానిపై కొంచెం ఆలోచించాలని అంటున్నారు పరిశోధకులు.

ఇవి కూడా చదవండి:

Panipuri Water: పానీపూరీ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా..? నిపుణులు ఏమంటున్నారు..?

Health Tips: మీకు ఈ సమస్యలు వెంటాడుతున్నాయా..? వంట గదిలో ఉండే వాటితో అద్భుతమైన ఫలితాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu