CCTV surveillance: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేశారో.. సీసీ కెమెరాల్లో చిక్కేస్తారు. ఆపై పూం పుహారే..!

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల మున్సిపల్ పట్టణాన్ని గ్రీన్ సిటీ, క్లీన్ సిటీగా మార్చేందుకు ఎమ్మెల్యే శిల్పా రవి.. ఇతర మున్సిపల్..

CCTV surveillance: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేశారో.. సీసీ కెమెరాల్లో చిక్కేస్తారు. ఆపై పూం పుహారే..!
Cc Camara Surveillance
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 07, 2021 | 11:54 AM

CCTV cameras surveillance – Nandyal: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల మున్సిపల్ పట్టణాన్ని గ్రీన్ సిటీ, క్లీన్ సిటీగా మార్చేందుకు ఎమ్మెల్యే శిల్పా రవి.. ఇతర మున్సిపల్ అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్కడైతే బహిరంగ ప్రదేశాల్లో చెత్త ఎక్కువగా వేస్తున్నారో.. వాటిని గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలన్నింటిని మున్సిపల్ కార్యాలయానికి అనుసంధానించారు. సీసీ కెమెరాల ద్వారా చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు.

నంద్యాల పట్టణంలో ఈ కార్యక్రమం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉండటంతోపాటు, రోడ్ల మీద చెత్త వేస్తున్న వారికి భారీగా పెనాల్టీలు కూడా వేస్తుండటంతో బహిరంగ ప్రదేశాలలో చెత్త వేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జరిమానాలకు బిత్తరపోయి పబ్లిక్ ప్లేసెస్‌లో చెత్త వేయడానికి భయపడుతున్నారు స్థానికులు. దీని ద్వారా ప్రజల్లో కొంత మార్పు వచ్చినట్లు ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. దీంతో మొత్తం పట్టణమంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.

కాగా, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేసి పెనాల్టీల బారినపడ్డ బాధితులు మాత్రం.. స్థానికులకు హితబోధ చేయడం కనిపిస్తోంది. చెత్త వేయడంలో ఇష్టానికి ప్రవర్తిస్తే అంతే సంగతంటూ తోటి కాలనీ వాసుల్ని హెచ్చిరిస్తున్నారు.

Cc Visuals

Cc Visuals

Read also: Snake in Airport: విమానంలోకి ఎక్కబోయిన పాము.. బెదిరిపోయిన ప్రయాణీకులు.. వైరల్‌గా మారిన వీడియో!