AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Religious harmony: మత సామరస్యాన్ని చాటుకున్న ముస్లిం కుటుంబం.. విరాట్ రామాలయ నిర్మాణానికి రూ.2.5 కోట్ల స్థలం విరాళం

బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లాలోని కైత్వాలియా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం విరాట్ రామాయణ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరగుతున్నాయి.

Religious harmony: మత సామరస్యాన్ని చాటుకున్న ముస్లిం కుటుంబం.. విరాట్ రామాలయ నిర్మాణానికి రూ.2.5 కోట్ల స్థలం విరాళం
Bihar Religious Harmony
Balaraju Goud
|

Updated on: Mar 23, 2022 | 9:40 AM

Share

Religious harmony: దేశంలో మత సామరస్యానికి ఉదాహరణగా బీహార్‌(Bihar)లోని ఒక ముస్లిం కుటుంబం(Muslim Family) నిలుస్తోంది. బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లాలోని కైత్వాలియా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం విరాట్ రామాయణ మందిర(Virat Ramayana Mandir) నిర్మాణానికి ఏర్పాట్లు జరగుతున్నాయి. ఈ ప్రాజెక్టును చేపట్టిన పాట్నాలోని మహావీర్ మందిర్ ట్రస్ట్‌కు ఓ ముస్లిం కుటుంబం రూ.2.5 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చింది. ‘విరాట్ రామాయణ మందిరం’ కోసం వ్యాపారవేత్త ఇస్తియాక్ అహ్మద్ ఖాన్ భూమిని విరాళంగా ఇచ్చారు. ‘గ్రామంలో ఎక్కువ భూమి మా కుటుంబం వద్ద ఉంది. ఆలయ నిర్మాణానికి ఏదైనా చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఇది మా కుటుంబ సంప్రదాయం. అందుకే దేవాలయ నిర్మాణానికి సొంత భూమిని ఇస్తున్నట్లు ఇష్తియాక్ అహ్మద్ ఖాన్ తెలిపారు.

ఈ ప్రాజెక్టును చేపట్టిన పాట్నాలోని మహావీర్ మందిర్ ట్రస్ట్ చీఫ్ ఆచార్య కిషోర్ కునాల్ సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, కేషారియా సబ్ డివిజన్ తూర్పు చన్ంపరన్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆలయ నిర్మాణానికి తన కుటుంబానికి చెందిన భూమిని విరాళంగా ఇవ్వడానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీలను అతను ఇటీవల పూర్తి చేశారని తెలిపారు. సామాజిక సామరస్యానికి ఖాన్ అతని కుటుంబం గొప్ప ఉదాహరణ అని ఆయన అన్నారు. సల్మాన్‌ సహాయం లేకుండా ఈ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ సాకారం చేసుకోవడం కష్టమయ్యేదన్నారు. మొత్తం 125 ఎకరాల విస్తీర్ణంలో భారీ రామాయణ దేవాలయాన్ని నిర్మించనున్నామని, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పెద్ద దేవాలయాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి కునాల్.. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తూర్పు చంపారన్‌లోని కేసరియా సబ్ డివిజన్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆలయానికి 23 కత్తల భూమిని విరాళంగా ఇచ్చారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం భూమి విలువ రూ.2.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. గతంలో కూడా, ఖాన్ అతని కుటుంబం ఆలయ ప్రాజెక్ట్ కోసం సహాయం చేయాలనే ఆలోచనకు తెరతీశారు. ఖాన్ ప్రధాన రహదారిపై రాయితీపై భూమిని కూడా ఇచ్చారు. ఆయన స్ఫూర్తితో గ్రామంలోని మరికొందరు కూడా భూమి ఇవ్వడం ప్రారంభించారు. విరాట్ రామాయణ దేవాలయం కోసం ఇప్పటి వరకు 100 ఎకరాల భూమిని సేకరించారు. ‘విరాట్‌ రామాయణ మందిరం’ 250 ఏళ్లకు పైగా మన్నిక ఉండేలా నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ నిర్మాణం కోసం, కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంలో నిమగ్నమైన సాంకేతిక నిపుణులు, నైపుణ్యం కలిగిన హస్తకళాకారుల సేవలను తీసుకుంటున్నారు.

‘విరాట్ రామాయణ మందిరం’ పొడవు 1080 అడుగులు, వెడల్పు 540 అడుగులు కాగా, ప్రపంచంలోనే ఎత్తైనదిగా 270 అడుగుల ఎత్తులో నిర్మాణం ఉంండనుంది. విరాట్ రామాయణ ఆలయ సముదాయానికి మూడు వైపులా రహదారి ఉంటుంది. అయోధ్య నుండి జనక్‌పూర్ వరకు నిర్మిస్తున్న రామ్ జాంకీ రహదారి ఈ ప్రాంతం గుండా వెళుతుంది. కేసరి బౌద్ధ స్థూపం కూడా ఈ మార్గంలో ఉంది. దేవకీ నది ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారని, రాముడు జనక్‌పూర్ నుండి అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు రాత్రిపూట బస చేశాడని నమ్ముతారు.

Read Also…. viral Video: వామ్మో! ఈ పిల్ల ధైర్యాన్ని మెచ్చాల్సిందే.. పాముకు ముద్దులు పెడుతూ.. షాక్ అవుతున్న నెటిజన్లు..