AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crow Facts: జీవిత భాగస్వామితో గొడవలా?.. కాకి నుంచి నేర్చుకోవాల్సిన 5 జీవిత పాఠాలివి..

మన చుట్టూ ఉన్న పక్షులలో కాకిని చాలామంది అశుభంగా భావించినా, అది నిజానికి గొప్ప తెలివితేటలు, సామాజిక విలువలు కలిగిన పక్షి. చాణక్యుడు సైతం కాకి జీవితం నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఐదు ముఖ్య లక్షణాలు ఉన్నాయని సూచించారు. కర్మకాండల్లో, పితృదేవతల రూపంలో పవిత్రతను పొందిన ఈ పక్షి, మనిషి జీవితానికి ఎన్నో ఆదర్శవంతమైన పాఠాలను నేర్పుతుంది.

Crow Facts: జీవిత భాగస్వామితో గొడవలా?.. కాకి నుంచి నేర్చుకోవాల్సిన 5 జీవిత పాఠాలివి..
Life Lessons From Crow
Bhavani
|

Updated on: Nov 09, 2025 | 7:45 PM

Share

కాకి కేవలం ఒక పక్షి కాదు.. అది ధైర్యం, తెలివి, పట్టుదల కలయిక. అత్యంత వేగవంతమైన ఆధునిక జీవనశైలిలో కోల్పోతున్న కొన్ని విలువైన లక్షణాలను మనిషి ఈ సామాన్య పక్షి నుంచి నేర్చుకోవాలి. ఇది చదివిన తర్వాత కచ్చితంగా మన ఆలోచనల్లో మార్పు రావడం ఖాయం.

1. ధైర్యం పట్టుదల

కాకి సహజంగానే ధైర్యం ఎక్కువ. తన లక్ష్యం వైపు కదులుతున్నప్పుడు అది ఎప్పుడూ భయపడదు. కోరికలు తీర్చుకోవాలంటే, లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనిషి కూడా జీవితంలో వచ్చే కష్టాలకు వెరవకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. తన తెలివితో గులకరాళ్లను వేసి నీటిని పైకి తెచ్చి దాహం తీర్చుకున్న కథ కాకి సమస్య పరిష్కార నైపుణ్యం పట్టుదలకు నిదర్శనం. మనిషి కూడా ప్రతి సమస్యను తెలివిగా పరిష్కరించుకోవాలనే పాఠాన్ని కాకి నేర్పుతుంది.

2. జాగరూకత ఏకాంతం

కాకులు ఎప్పుడూ తమ కార్యకలాపాలను అత్యంత జాగరూకతతో నిర్వహిస్తాయి. అవి తమ ఆహారాన్ని సేకరించేటప్పుడు కూడా ఒంటరిగా, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. ఎవరినీ సులభంగా నమ్మవు. మనిషి కూడా తమ లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు ఇతరులను గుడ్డిగా నమ్మకుండా, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. తమ ప్రైవసీని (ఏకాంతాన్ని) కాపాడుకోవడంలో కాకి ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది.

3. పిల్లల పెంపకం జీవిత నైపుణ్యాలు

సాధారణంగా ఇతర పక్షుల పిల్లలు రెక్కలు రాగానే తల్లిదండ్రులను వదిలి ఎగిరిపోతాయి. కాకులు మాత్రం మనుషుల్లాగే తమ పిల్లల్ని చాలా కాలం పాటు ఓపిగ్గా పోషిస్తాయి. వాటికి జీవన నైపుణ్యాలు నేర్పించడంలో ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఈ లక్షణం కుటుంబ బాధ్యతలను విస్మరించకూడదనే పాఠాన్ని మనిషికి నేర్పుతుంది.

4. సహవాసం సామాజిక జీవితం

కాకులు తమ గూడును చాలా పద్ధతిగా నిర్మించుకుంటాయి. అంతేకాక అవి ఎప్పుడూ గుంపులుగా, సామాజిక జీవనాన్ని ఇష్టపడతాయి. మనిషి కూడా తన ఇల్లు గూడును పద్ధతిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే, కుటుంబ సభ్యులు బంధువులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. కాకి అరిస్తే బంధువులు వస్తారనే నమ్మకం కూడా కాకికి సమాజంలో ఉన్న సామాజిక బంధాన్ని తెలియజేస్తుంది.

5. భాగస్వామి పట్ల నిబద్ధత

కాకి జీవిత భాగస్వామిని ఎన్నుకున్న తర్వాత జీవితకాలంలో మళ్లీ మార్చకుండా నిబద్ధతతో ఉంటుంది. ఎంత కష్టమొచ్చినా తాను ఎన్నుకున్న పక్షితోనే ఉంటుంది. ఇది వైవాహిక జీవితంలో నమ్మకం విధేయత ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఓ సాధారణ పక్షికే ఇంత ఉంటే అన్నీ ఉన్న మనుషులు ఎంత ఆలోచించాలి. మనిషి కూడా తన సంబంధాలలో నిబద్ధతను కొనసాగించడం నేర్చుకోవాలి.

Follow Us