Remedies tips: మీ ఇంట్లో బొద్దింకలు, ఈగలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇలా చేస్తే కనిపించకుండా పోతాయి..
ఈగలు, బొద్దింకల వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా..? అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి.. అవేంటో తెలుసుకుందాం..
ప్రతి వ్యక్తి తన ఇల్లు శుభ్రంగా ఉండాలని కోరుకుంటాడు. అక్కడ మీరు ఎలాంటి క్రిములు-కీటకాలు సంచరించడం అస్సలు సహించలేరు. కానీ ఇంట్లో దోమలు, ఈగల సందడి చేయడం చూస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అదే సమయంలో వంటగదిలో తిరుగుతున్న బొద్దింకను చూస్తే మాత్రం.. అద్బుతంగా చేసుకుకున్న బిర్యానీ కూడా తినాలని అనిపించదు. ఎందుకంటే అవి మురికి కాలువ నుంచి బయటకు రావడం ద్వారా మీ ఆహార, పానీయాలను కలుషితం చేస్తాయి. దీనివల్ల అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అయితే.. మీ ఇంట్లో కూడా బొద్దింకలు పెరుగుతున్నట్లయితే, జాగ్రత్తగా ఉండండి. వెంటనే వాటిని తొలగించే మార్గాలను తెలుసుకోండి. మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే, చింతించాల్సిన అవసరం లేదు. మీరు అచ్చు ఇలానే అనుకుంటున్నట్లైతే.. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు ఏదైన చేయాలని అనుకుంటున్నారు.. అయితే దీని కోసం మీరు కొన్ని ఇంటి నివారణ చిట్కాలను అనుసరించాలి. బొద్దింకలను వదిలించుకోవడానికి సులభమైన మార్గాలు ఏమిటో తెలుసుకుందాం..
కీటకాలను తరిమేసేందుకు స్ప్రే..
ఇంట్లో బొద్దింక, ఫ్లై-దోమలను తొలగించడానికి మీరు స్ప్రే చేయాలి. దీన్ని చేయడానికి మీరు ఒక పాత్రలో నీటిని తీసుకోండి. దీని తరువాత, చాలా వెల్లుల్లి తొక్కలు, మిరప కాడలు, కలబంద ఆకులు వేసి మూత పెట్టండి. ఆ నీటిని మూడు రోజుల పాటు ఇలా మూత పెట్టి పక్కన పెట్టాలి. దీని తరువాత, నీటిలో ఉన్న అన్ని వస్తువులను మెత్తగా మిక్సీ పట్టండి.. వడపోసి.. అదే నీటిలో కలపండి. ఇలా చేసిన తర్వాత మీ క్రిమిసంహారక స్ప్రే సిద్ధంగా ఉంటుంది.
స్ప్రే చేస్తున్నప్పుడు, అది దుర్వాసన వస్తుందని గుర్తుంచుకోండి. అందువల్ల, ఆ పాత్రను వంటగదిలో లేదా మీ పడుకునే గదిలో ఉంచవద్దు. ఇందుకు బదులుగా కుటుంబ సభ్యుల కదలికలు తక్కువగా ఉండే ప్రదేశంలో ఆ పాత్రను ఉంచండి. 3 రోజుల పాటు ఆ పాత్రను మూతతో గట్టిగా మూసి ఉంచండి.
ఇలా స్ప్రే చేయండి..
ఈ స్ప్రే చేసిన తర్వాత, మీరు బొద్దింక, దోమల-ఈగలు దాగున్న ప్రదేశాలలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. తేమ ఉన్న ప్రదేశాలలో లేదా నీరు మిగిలి ఉన్న ప్రదేశాలలో ఈ స్ప్రేని పిచికారీ చేయండి. మంచం కింద, పెట్టెల వెనుక స్ప్రే చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెందవు. ఇల్లు క్రిములు లేకుండా పోతుంది.
ఇలా కాకుండా కెమికల్‌తో..
కిరోసిన్‌తో బొద్దింకలను వదిలించుకోండి
మీ వంటగదిలో చాలా బొద్దింకలు ఉంటే, కిరోసిన్ మీకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనిని ఉపయోగించే ముందు మొదట బొద్దింక జాడలు ఉన్న ప్రదేశాలను గుర్తించండి. దీని తరువాత, ఈ ప్రదేశాలలో కిరోసిన్ ను పిచికారీ చేయండి. కిరోసిన్ వాసనకు బొద్దింకలు పారిపోతాయి. అయితే, కెరిసిన్ స్ప్రే చేసేటప్పుడు మీ చర్మాన్ని కప్పి ఉంచేలా జాగ్రత్త వహించండి.
వేప బొద్దింక భయం నుంచి ఉపశమనం..
బేకింగ్ సోడా చాలా ప్రభావవంతంగా..
బొద్దింకలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడా కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం బేకింగ్ సోడాలో పంచదార మిక్స్ చేసి మిశ్రమంలా చేసుకోవాలి. ఆ తర్వాత బొద్దింక ఉన్న ప్రదేశంలో చల్లాలి. ఇది బొద్దింకలను చంపగలదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..