Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aghora Married: తమిళనాడు రాష్ట్రంలో సంచలనం.. మహిళా అఘోరీని పెళ్లి చేసుకున్న అఘోరా

తన దగ్గర శిష్యులుగా ఉన్న అఘోరని మణికందన్ పెళ్లిచేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం తాళి కట్టి కలకత్తా కి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు అఘోర మణికంధన్.

Aghora Married: తమిళనాడు రాష్ట్రంలో సంచలనం.. మహిళా అఘోరీని పెళ్లి చేసుకున్న అఘోరా
Aghora Manikandan Married
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 22, 2021 | 8:02 PM

Aghori Manikandan Married: తమిళనాడు లోని తిరుచ్చి జిల్లా అరియమంగళానికి చెందిన మణికందన్. కాశీ లో అఘోర ఉపాసన చేసి తన సొంత గ్రామానికి వచ్చి జై అఘోర కాళీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిరవిహిస్తున్నాడు. సమాధుల వద్ద అఘోర పూజలు నిర్వహిస్తూ తన శిష్యులకు అఘోర ఉపాసన చేయిస్తున్నారు మణికంధన్. ఈ క్రమంలో తన దగ్గర శిష్యులుగా ఉన్న అఘోరని మణికందన్ పెళ్లిచేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం తాళి కట్టి కలకత్తా కి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు అఘోర మణికంధన్. మూడేళ్ల క్రితం ఆత్మశాంతి తన తల్లి దేహంపై కూర్చుని ప్రార్థనలు చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. అదేవిధంగా ఇటీవల అగ్ని ప్రమాదంలో మరణించిన శిష్యుడి మృతదేహంపై కూర్చొని అన్నమశాంతి పూజలు నిర్వహించారు. తాజాగా మరో విషయంతో సంచలనంగా మారారు.

తాజాగా కలకత్తాకు చెందిన తన శిష్యురాలిని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రియాంక అనే మహిళ ఎనిమిదేళ్లుగా మణికందన్ వద్ద అగోరీలకు శిక్షణ ఇస్తోంది. ఈ నేపథ్యంలో అఘోరి గురువు మణికందన్‌తో ప్రియాంక వివాహం నిన్న తెల్లవారుజామున జరిగింది. పెళ్లి సమయంలో వరుడు అగోరి మణికందన్, వధువు అగోరి ప్రియాంక శరీరమంతా జల్లులతో అఘోరి కోలంలోనే ఉండటం విశేషం. పెళ్లి చేసుకుని కరుప్పస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.

అంతకుముందు యజ్ఞం సందర్భంగా మృదంగం మోగిస్తూ తోటి అఘోరాలు శంఖం ఊపుతూ నాట్యాలు చేశారు. అఘోరి మణికందన్ గురువు సిద్ధార్థ్ వే మదురైపాల్సామి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. కల్యాణం అనంతరం మళ్లీ యజ్ఞం నిర్వహించి దీపారాధన నిర్వహించారు.

Read Also… Hair Stylist : మతిపోయే హెయిర్‌స్టైల్స్‌ !! జుట్టుని కాన్వాస్‌లా మార్చేస్తోందిగా !! వీడియో