AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి ఎందుకు తగ్గుతుందో తెలుసా?.. శాస్త్రవేత్తల పరిశోదలో ఆశ్చర్యపోయే విషయాలు!

వయస్సు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కోల్పోతామని, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బంది పడతామని మనందరికీ తెలుసు. కానీ ఇలా జరగడానికి కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ దీనిపై పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు చివరకు ఇందుకు కారణం కనుగొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం వయస్సు పెరిగేకొద్ది మెదడు పనితీరు తగ్గడానికి కారణం ప్రోటీన్ అని తెలసుకున్నారు. అంతేకాదు.. దీనికి పరిష్కారం కూడా కనిపెట్టారు. అందేతో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి ఎందుకు తగ్గుతుందో తెలుసా?.. శాస్త్రవేత్తల పరిశోదలో ఆశ్చర్యపోయే విషయాలు!
Brain Function
Anand T
|

Updated on: Aug 27, 2025 | 4:25 PM

Share

వయస్సు పెరిగేకొద్ది జ్ఞాపకశక్తి కోల్పోవడం, నెమ్మదిగా నేర్చుకోవడం, పేలవమైన చురుకుదనం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇందుకు ప్రధాన కారణం మెదడును ప్రభావితం చేసే ప్రోటీన్ అని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాన్ ఫ్రాన్సిస్కో (UCSF) పరిశోధకులు ఈ ప్రోటీన్ మెదడు వృద్ధాప్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు. మెదడులో వృద్ధాప్యం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే భాగం హిప్పోకాంపస్. ఈ భాగం అభ్యాసం, జ్ఞాపకశక్తిని నియంత్రిస్తుంది. దీనిని పరిశోధించడానికి, పరిశోధకులు రెండు ఎలుకలను ఎంచుకున్నారు. వాటిలో ఒకటి తక్కువ వయస్సున్నది, మరొకటి ఎక్కువ వయస్సున్నది.. వాటి రెండు మెదడులను పోల్చారు. కాలక్రమేణా వాటిలో ఏ జన్యువులు, ప్రోటీన్లు మారాయో వారు పరిశీలించారు. అప్పుడు మెదడు పనితీరుపై ప్రభావం చూపే FTL1 అనే ప్రోటీన్‌ను వారు కనుగొన్నారు. చిన్న ఎలుకల కంటే పెద్ద ఎలుకలలో FTL1 స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. FTL1 ఎక్కువగా ఉండటం అంటే మెదడు కణాలు ఒకదానితో ఒకటి తక్కువగా కనెక్ట్ అవుతాయి అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా బలహీనపడుతుంది.

చిన్న ఎలుకలలో FTL1 పరీక్ష

మెదడు వృద్ధాప్యానికి FTL1 ప్రోటీన్‌ నిజంగా కారణమా అని పరీక్షించడానికి, పరిశోధకులు మరో ప్రయోగం చేశారు. ఇప్పుడు చిన్న ఎలుకలలో ఈ ప్రోటీన్ స్థాయిని పెంచారు. అప్పుడు ఈ చిన్న ఎలుక మెదడు పనితీరు కూడా పాత ఎలుకల మాదిరిగా కనిపించడం, పనిచేయడం ప్రారంభించాయి. ప్రయోగశాలలో నిర్వహించిన ప్రయోగాలలో ఎక్కువ FTL1 ఉన్న నాడీ కణాలు జర్నల్ శాఖలను ఏర్పరచలేదని కనుగొన్నారు. బదులుగా, సాధారణ నిర్మాణాలు మాత్రమే ఏర్పడ్డాయి, ఇది మెదడు కణాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడం కష్టతరం చేస్తున్నట్టు గుర్తించారు.

ప్రభావాలను తిప్పికొట్టడం

అదే విధంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా మార్గం ఉందా అని పరిశోదకులు మరో ప్రయోగం చేశారు. ఈ సారి పెద్ద ఎలుకలో FTL1 ప్రోటీన్‌ స్థాయిని తగ్గించడానికి ప్రయత్నించారు. అప్పుడు పెద్ద ఎలుకలోని మొదడు పనితీరు మెరుగుపడినట్టు గుర్తించారు. ఈసారి . పెద్ద ఎలుకల మెదడు కణాలలో ఎక్కువ కనెక్షన్లు గుర్తించారు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పరీక్షలలో మెరుగ్గా పనిచేశాయి. ఈ సందర్భంగా పరిశోధన సీనియర్ రచయిత డాక్టర్ సౌల్ విల్లెడా మాట్లాడుతూ.. ఇది నిజంగా రుగ్మతలను తిప్పికొట్టడం లాంటిది. ఇది లక్షణాలను ఆలస్యం చేయడం లేదా నివారించడం కంటే ఎక్కువ అన్నారు.

భవిష్యత్తుపై ఆశ

ఈ పరిశోధన భవిష్యత్తులో FTL1 ను తగ్గించి, మెదడు వృద్ధాప్యాన్ని నిరోధించగల మందులు లేదా చికిత్సలను అభివృద్ధి చేయవచ్చని ఆశను పెంచుతోంది. డాక్టర్ విల్లేడా ప్రకారం.. ‘వృద్ధాప్యం చెడు ప్రభావాలను తగ్గించడానికి మనం ఇప్పుడు మరిన్ని అవకాశాలను చూస్తున్నాము. వృద్ధాప్య శాస్త్రంపై పనిచేయడానికి ఇది గొప్ప సమయంగా చెప్పుకొచ్చారు.

మరిన్ని హ్యూమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.