AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మనిషికి సమతుల్య ప్రవర్తన అవసరం.. మరీ ముఖ్యంగా ఆ మూడు విషయాల్లో.. చాణక్యుడు చెప్పిన అవి ఏమిటో తెలుసుకుందాం..

ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో బాగా ప్రావీణ్యం కలవాడు. ఆయన తన విధానాలను ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించారు.

Chanakya Niti: మనిషికి సమతుల్య ప్రవర్తన అవసరం.. మరీ ముఖ్యంగా ఆ మూడు విషయాల్లో.. చాణక్యుడు చెప్పిన అవి ఏమిటో తెలుసుకుందాం..
Chanakya Niti
KVD Varma
|

Updated on: Nov 27, 2021 | 2:20 PM

Share

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో బాగా ప్రావీణ్యం కలవాడు. ఆయన తన విధానాలను ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించారు. ఆచార్య చాణక్యుడు రచించిన అనేక గ్రంథాలు విజయానికి సంబంధించిన ప్రాథమిక మంత్రాన్ని ప్రజలకు బోధించడమే కాకుండా వారికి సరైన మార్గనిర్దేశం చేస్తాయి. ఆయన ఆకాలంలో చెప్పిన నీతిలో ఉన్న విషయాలు నేటికీ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాయి. చాణక్యుడు మనిషి నైతికతలోని అనేక ముఖ్యాంశాలను బయటపెట్టారు. వాటిలో సంబంధం, స్నేహం, శత్రువు, డబ్బు, కుటుంబం, భార్య, వ్యాపారం వంటి అనేక విషయాలను లోతుగా వివరించారు.

ఆచార్య చాణక్యుడి విధానాలు చాలా కఠినంగా ఉన్నప్పటికీ అవి ఇప్పటికీ హేతుబద్ధంగా ఉంటాయి. అవి సత్య భావాన్ని ఇస్తాయి. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో అలాంటి కొంతమంది వ్యక్తుల గురించి చెప్పారు. దీని గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

చాణక్యుడు ఎప్పుడూ సమతుల్య ప్రవర్తన కలిగి ఉండాలని తన నీతి ద్వారా చెప్పాడు. ఎవరితోనూ ఎక్కువ దూరం ఉంచకూడదు లేదా ఎక్కువ సన్నిహితంగా ఉండకూడదు అని చాణక్యుని మాటల అర్ధం.

శక్తివంతమైన మనిషి

ఆచార్య చాణక్యుని ప్రకారం, మనం శక్తివంతమైన వ్యక్తికి చాలా దగ్గరగా లేదా ఎక్కువ దూరం ఉంచకూడదు. ఎందుకంటే వారి దగ్గరకు వెళితే ఆ వ్యక్తి ఆధిపత్యం వల్ల అతని కింద పనులు చేయాల్సి వస్తుంది. దూరం పాటిస్తే అతని నుంచి అన్ని రకాల సౌకర్యాలు పొందలేరు. అటువంటి వ్యక్తులతో మీరు సమతుల్య ప్రవర్తనను కొనసాగించాలి.

అగ్ని ఆచార్య చాణక్య మాట్లాడుతూ, నిప్పు వెలిగించేటప్పుడు లేదా అగ్నితో ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం అగ్నికి చాలా దూరంగా ఉంటే ఆహారం వండలేము. మనం అగ్నికి చాలా దగ్గరగా ఉంటే ఆహారం కాలిపోవచ్చు. అందువల్ల, అగ్నితో కూడా సమతుల్యతను కొనసాగించాలి.

స్త్రీ

స్త్రీతో పురుషుడు ఎప్పుడూ సమతుల్య ప్రవర్తన కలిగి ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మీరు స్త్రీకి చాలా దగ్గరగా వెళితే, మీరు అసూయ లేదా అవమానాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ, మీరు మరింత దూరం ఉంచినట్లయితే మీరు వారి ద్వేషాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Tomato Price: దక్షిణాదిలో కాస్త తగ్గిన టమాటా ధర.. అక్కడ మాత్రం అదిరిపోయే రేంజిలోనే.. ఎక్కడ ఎంత రేటు ఉందంటే.. 

Mental Health: మీ వ్యవహార శైలిలో ఈ మార్పులు కనిపిస్తుంటే మీ మానసిక ఆరోగ్యం పాడైనట్టే..వెంటనే నిపుణులను సంప్రదించాల్సిందే!

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇ