AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neem Trees: వేప ఆపదలో ఉందా?.. ఔషదం మొక్క అంతం కాబోతోందా? ఊహకందని తెగుళ్ల వెనుక అసలు కారణం అదేనా!

వేప ఆపదలో ఉందా.. అనేక రోగాలను తగ్గించే చెట్టుకే జబ్బు చేసిందా.. ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సర్వరోగ నివారిణిగా భావించే వేప చెట్టు ఎక్కడ చూసినా తెగుళ్లతో ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తుండటం ఇందుకు కారణం.

Neem Trees: వేప ఆపదలో ఉందా?.. ఔషదం మొక్క అంతం కాబోతోందా? ఊహకందని తెగుళ్ల వెనుక అసలు కారణం అదేనా!
Neem Trees
Balaraju Goud
|

Updated on: Nov 27, 2021 | 2:18 PM

Share

Neem Trees ‘Dieback’ Disease: వేప ఆపదలో ఉందా.. అనేక రోగాలను తగ్గించే చెట్టుకే జబ్బు చేసిందా.. ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సర్వరోగ నివారిణిగా భావించే వేప చెట్టు ఎక్కడ చూసినా తెగుళ్లతో ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తుండటం ఇందుకు కారణం. అసలు వేపచెట్టుకు ఏమైంది అంటూ తెగ బాధపడిపోతున్నారు ప్రకృతి ప్రేమికుడు.. గ్రామాల్లోనే కాదు మెట్రో నగరాల్లో కూడా అనేక జబ్బులకు వేపాకు ను దివ్య ఔషధంగా వాడుతున్నారు అంటే వేప చెట్టుకు ఉన్న ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వేపచెట్టు ప్రస్తుతం తెగుళ్లతో ప్రమాదంలో ఉండటాన్ని చూస్తున్న ప్రకృతి ప్రేమికులు విలవిలలాడుతున్నారు.

వేప చెట్టు లేని ఊరు ఉండదు కాలనీ కూడా ఉండదు. ప్రతి చోట వేప చెట్టు ఉంటుంది. అలాంటి ప్రతి వేపచెట్టుకు ప్రస్తుతం తెగులు సోకి కళావిహీనంగా ఉంటున్నాయి. ఏదో ప్రమాదం వచ్చిందని చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. పచ్చగా ఉండాల్సిన చెట్లు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. చిగుర్ల నుంచి ప్రారంభమై మొదలు వరకూ నిలువునా ఎండిపోతున్నాయి. గతంలో కర్ణాటక, రాయలసీమ కనిపించే ఈ తెగులు ఇప్పుడు తెలంగాణకు కూడా వ్యాపించింది. వేపచెట్టు ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. వైద్యపరంగా, సంస్కృతి పరంగా, శాస్త్ర పరంగా కూడా మానవాళి జీవితం తో పెనవేసుకున్న చెట్టు ఇది. చిన్నప్పుడు చాలామందికి వేప పుల్ల తోనే దంత దావనం. వేప చేదు లేకుండా ఉగాది పచ్చడి ఊహించ గలమా..? ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అని సామెత… కానీ, కొందరైతే వేప చెట్టు చేసే మేలు…అని ఊటంకిస్తారు…

వేప చెట్లలో కనిపిస్తున్న ఈ తెగులు ను ‘ డై బ్యాక్ డిసీజ్’ కారణమని సైంటిస్టులు తేల్చారు. బ్యాక్టీరియా గాలి ద్వారా వ్యాపించడంవల్ల వేప చెట్ల కొనలు ఎండిపోయి, రెండు మూడు నెలల్లో చెట్టు మొత్తం నిర్జీవంగా మారుతుంది. .ఇది ఇలాగే కొనసాగితే 2 సంవత్సరాలలో 95 % వేప చెట్లు చనిపోతాయి. అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ అంతగా భయపడాల్సిన అవసరం లేదని సైంటిస్టులు అంటున్నారు. చీడ ఆశించిన వేపచెట్టు కొమ్మలను వెంటనే నరికి బావిస్టిన్ను పిచికారి చేయాలి. లేదంటే మైదాకును ముద్దగా చేసి నరికిన కొమ్మలకు అంటించాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.. అలాగే కొన్ని రసాయనాలను పిచికారీ చేస్తే.. తెగులును అరికట్ట వచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కడ చూసినా తెగులు సోకిన వేపచెట్టు కనిపిస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి మామూలు చెట్లు అవుతాయా లేదా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇప్పటికీ గ్రామాల నుంచి మెట్రో నగరాల వరకు.. ఎక్కడైనా పిల్లలకు ఆటలమ్మ, అమ్మవారు లేదా చికెన్ ఫాక్స్ సోకినప్పుడు వేపాకులు ఉపయోగిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. తెలుగు ప్రజలతో ఇంత బలంగా పెనవేసుకున్న వేప చెట్టు మళ్లీ పచ్చపచ్చగా చిగురించాలని తెగుళ్ళను దూరం అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

Read Also…  Holidays 2022: వచ్చే ఏడాది సెలవులు, పండుగలు ఇవే.. జాబితాను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం