WL: దీని అర్థం వెయిటింగ్ లిస్ట్. అంటే, మీరు టికెట్ తీసుకున్నారు, కానీ కన్ఫర్మ్ సీటు లేదా RAC పొందలేదు. కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే, మీరు ఆ బెర్త్‌ను పొందే అవకాశం ఉంది. అప్పుడు మాత్రమె మీ టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఉదాహరణకు, మీ టిక్కెట్‌పై WL12 అని రాసి ఉంటే, 12 మంది ప్రయాణాన్ని రద్దు చేస్తే మీ సీటు కన్ఫర్మ్ అవుతుందని అర్థం.