TATA Group: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. కొత్త వ్యాపారంలోకి అడుగులు.. రూ.2,220 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్..!
TATA Group: టాటా గ్రూపు మరో కొత్త బిజినెస్‌లోకి అడుగు పెడుతోంది. కొత్తగా సెమీకండక్టర్ల అసెంబ్లింగ్ రంగంలోకి ప్రవేశించాలని గ్రూప్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా..
Follow us
TATA Group: టాటా గ్రూపు మరో కొత్త బిజినెస్‌లోకి అడుగు పెడుతోంది. కొత్తగా సెమీకండక్టర్ల అసెంబ్లింగ్ రంగంలోకి ప్రవేశించాలని గ్రూప్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2,220 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
అవసరమైన ప్లాంట్‌ను ఏర్పాటు చేసి సుమారు 4వేల మంది ఉపాధి కల్పించాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ ప్లాంట్‌కు అవసరమైన భూములు ఇచ్చేందుకు తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సెమీకండక్టర్ల అసెంబ్లింగ్ రంగంకు సంబంధించి ప్లాంట్ గురించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు కూడా సాగినట్లు సమాచారం. డిసెంబర్‌లోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
భారత్‌లో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని భారత్‌లో మరింత ప్రోత్సహించాలని ప్రధాని మోడీ పిలుపు మేరకు ఈ ప్లాంట్ మరింత దోహదం చేస్తుందని భావిస్తున్నారు.