AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: అసలు వీధి పోటు అంటే ఏంటి.? దీనివల్ల ఏం జరుగుతుంది..

సాధారణంగా మనం నివాసం ఉంటున్న ఇళ్లుకు ఎదురుగా నిలువైన వీధి ఉంటే దానిని వీధిపోటు అంటారు. ఇల్లు ఏ మూలలోనూ రోడ్డు మధ్యానికి పడకూడదు అని వాస్తు పండితులు చెబుతుంటారు. దీనివల్ల ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఒక్కో దిశలో వీధి పోటు ఉంటే ఒక్కో రకమైన నష్టాలు ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఏ దిశలో వీధి పోటు ఉంటే ఎలాంటి నష్టాలు...

Vastu Tips: అసలు వీధి పోటు అంటే ఏంటి.? దీనివల్ల ఏం జరుగుతుంది..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Mar 21, 2024 | 4:46 PM

Share

వాస్తు శాస్త్రంలో ఎన్నో అంశాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఇలాంటి వాటిలో వీధి పోటు ఒకటి. మన నివసిస్తున్న ఇళ్లు, లేదా వ్యాపారానికి వీధిపోటు ఉండడం ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇంతకీ వీధిపోటు అంటే ఏంటి.? దీనివల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మనం నివాసం ఉంటున్న ఇళ్లుకు ఎదురుగా నిలువైన వీధి ఉంటే దానిని వీధిపోటు అంటారు. ఇల్లు ఏ మూలలోనూ రోడ్డు మధ్యానికి పడకూడదు అని వాస్తు పండితులు చెబుతుంటారు. దీనివల్ల ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఒక్కో దిశలో వీధి పోటు ఉంటే ఒక్కో రకమైన నష్టాలు ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఏ దిశలో వీధి పోటు ఉంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆగ్నేయంలో వీధిపోటు ఉంటే అనుకోని కష్టాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నైరుతి దిశలో ఒకవేళ వీధిపోటు ఉంటే ఇంట్లో ఆర్థిక నష్టాలు ఉంటాయని అంటున్నారు. ఇంట్లో ఎంత డబ్బులు దాచి పెట్టాలని ప్రయత్నించినా ఆ ధనం నిలవదు అని చెబుతున్నారు. ఇక ఒకవేళ ఆగ్నేయం దిశలో వీధపోటు ఉంటే.. ఆ ఇంట్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అలాగే నైరుతి వీధి పోటు ఉంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతారు. ఎప్పుడూ ఏదో ఒక అనుకోని ఖర్చులు వెంటాడుతుంటాయి. అలాగే ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. దక్షిణ మధ్య వీధిపోటు ఉంటే చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల మరణాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఒకవేళ ఉత్తర వాయువ్యంలో వీధి పోటు ఉంటే ఇంట్లోని స్త్రీలపై చెడు ప్రభావం కనబడుతుంది. గృహిణులకు తరచూ వ్యాధులు వేధిస్తూ ఉంటాయి.

ఇలాంటి దోషం ఉన్న ఇంట్లో ఉండే యుతకులకు పెళ్లిళ్లు జరగవు. దక్షిణ మధ్య వీధిపోటు వల్ల ధన నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈశాన్యం దిశలో వీధి పోటు ఉంటే ఆ ఇంట్లో మగ సంతానం తగ్గే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ నైరుతి వీధిపోటు వల్ల ఇంట్లో నివసించే మగవాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. వీరికి ఉద్యోగాల్లో పెద్దగా ఎదుగుదల ఉండదు. ప్రమోషన్లు రావు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..