Vastu tips: ఈ వాస్తు దోషాలతో అన్నింటా ఇబ్బందులే.. వెంటనే అలర్ట్‌ అవ్వండి..

భారతీయులు, మరీ ముఖ్యంగా హిందువులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. వాస్తుకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. అందుకోసం వాస్తు నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటారు, సూచనలు పాటిస్తుంటారు. ఇంటి నిర్మాణం అనే ఆలోచన రాగానే మొదటగా చేసే పని వాస్తు నిపుణులను సంప్రదించడమే. అయితే వాస్తు అనేది కేవలం...

Vastu tips: ఈ వాస్తు దోషాలతో అన్నింటా ఇబ్బందులే.. వెంటనే అలర్ట్‌ అవ్వండి..
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 06, 2024 | 6:27 PM

భారతీయులు, మరీ ముఖ్యంగా హిందువులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. వాస్తుకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. అందుకోసం వాస్తు నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటారు, సూచనలు పాటిస్తుంటారు. ఇంటి నిర్మాణం అనే ఆలోచన రాగానే మొదటగా చేసే పని వాస్తు నిపుణులను సంప్రదించడమే. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే కావని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనకు తెలిసో, తెలియకో చేసే కొన్ని వాస్తు తప్పులు తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తాయని అంటున్నారు. ఇంతకీ ఆ చిన్న చిన్న వాస్తు తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో చెత్త లేకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈశాన్యం దిశలో అవసరంలేని ఖాళీ డబ్బాలు, చిత్తు కాగితాలు లేకుండా చూసుకోవాలి. అలా అని ఇలాంటి పనికి రాని వస్తువులను స్టోర్‌ రూమ్‌లో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో అవసరం లేని వస్తువులను వీలైనంత త్వరగా బయటపడేయాలని సూచిస్తున్నారు.

* ఇక మనలో చాలా మంది చేసే ప్రధాన వాస్తు తప్పుల్లో పూర్వీకుల ఫొటోలకు సంబంధించినవి కూడా ఉంటాయి. చనిపోయిన బంధువుల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం సర్వసాధారణమైన విషయం అయితే. ఇలాంటి ఫొటోలను సరైన దిశలో ఏర్పాటు చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు. పూర్వీకుల ఫొటోలను ఉత్తం వైపు దిశలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు

* ఇంట్లో విరిగిన కుర్చీలు, కూలర్లు లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో పెట్టకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో విరిగిన వస్తువులు ఉండడం వాస్తు దోషాలకు కారణమవుతాయని అంటున్నారు. ఇది ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరగడానికి కారణమవుతుందని అంటున్నారు.

* ఇక నిద్రపోయే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో పాదాలు దక్షిణ దిశలో ఉంచకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. దక్షిణ దిశను యమ దిక్కుగా చెబుతుంటారు. కాబట్టి ఈ దిశగా కాళ్లు పెట్టకోకూడదు. దక్షిణం వైపు తల పెట్టుకొని నిద్రించడం ఉత్తమమైన చర్యగా చెప్పొచ్చు.

నోట్‌: పైన తెలిసిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..