Astrology: పేదరికానికి కారణాలు ఇవేనంటా.. పండితులు ఏం చెబుతున్నారంటే..

చిన్నచిన్న పనులు చేసుకునే వారి నుంచి మొదలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తల వరకు ప్రతీ ఒక్కరు కోరుకునేది ఆర్థికంగా ఎదగాలని. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తుంటారు. ఆ దిశగానే నిత్యం కృసి చేస్తుంటారు, కష్టపడి పని చేస్తుంటారు. అయితే మనలో కొందరు ఎంత కష్టపడినా ఆశించిన స్థాయిలో మాత్రం ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు. అయితే ఎంత కష్టపడినా...

Astrology: పేదరికానికి కారణాలు ఇవేనంటా.. పండితులు ఏం చెబుతున్నారంటే..
Poor
Follow us

|

Updated on: Mar 26, 2024 | 3:24 PM

చిన్నచిన్న పనులు చేసుకునే వారి నుంచి మొదలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తల వరకు ప్రతీ ఒక్కరు కోరుకునేది ఆర్థికంగా ఎదగాలని. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తుంటారు. ఆ దిశగానే నిత్యం కృసి చేస్తుంటారు, కష్టపడి పని చేస్తుంటారు. అయితే మనలో కొందరు ఎంత కష్టపడినా ఆశించిన స్థాయిలో మాత్రం ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు. అయితే ఎంత కష్టపడినా పేదరికం వెంటాడడానికి శాస్త్రం పరంగా కొన్ని అంశాలే కారణమని చెబుతున్నారు. ఇంతకీ ఏ తప్పుల వల్ల పేదరికం వెంటాడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం కూడా పేదరికానికి ఒక కారణంగా పండితులు చెబుతున్నారు. ఉదయం ఆలస్యంగా నిద్రలేసే వారి ఇంట్లో పేదరికం తాండవిస్తుందని చెబుతున్నారు. నిత్యం బద్ధకంగా ఉండే వారు కూడా ఆర్థికంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతారని చెబుతున్నారు. సోమరితం పురోగతికి అడ్డుకట్టగా మారుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు అలాంటి వారి వద్ద లక్ష్మీ కూడా నిలవదని చెబుతున్నారు.

* ఇతరుల ఆస్తులపై ఆశపడే వారు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోలేరని పండితులు చెబుతున్నారు. అన్యాయంగా ఇతరుల ఆస్తిని దోచుకుంటే అప్పటి వరకు ధనవంతులుగా ఉన్నా దీర్ఘకాలంలో సమస్యలు తప్పవని చెబుతున్నారు.ఇలాంటి వారి దగ్గర ధనం నిలవదని చెబుతున్నారు.

* అలాగే అకారణంగా నిత్యం కోపం ప్రదర్శించే వారు కూడా పేదరికం బారినపడతారని చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తుల వద్ద లక్ష్మీ దేవీ ఉండడానికి ఇష్టపడదు.

* జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి దూరంగా పారిపోయే వ్యక్తులు కూడా పేదరికంలో కూరుకుపోతారని పండితులు చెబుతున్నారు. కష్టాలను ఎదుర్కొని వాటిని పరిష్కరించే వారిపైనే లక్ష్మీదేవీ అనుగ్రహం ఉంటుందని అంటున్నారు.

* ఇక విరిగిన పాత్రల్లో భోజనం చేసే వారిని కూడా పేదరికం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శని దేవుడి ప్రతికూల ప్రభావం ఉంటుందని అంటున్నారు.

* మురికి దుస్తులను ధరించడం కూడా పేదరికానికి ఒక కారణమని పండితులు అభిప్రాయపడుతున్నారు. స్వచ్ఛత ఉన్న ప్రదేశాల్లోనే లక్ష్మీ దేవీ నివసిస్తుంది. అందుకే ఇంటిని కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతుంటారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం కొందరు పండితులు తెలిపిన అంశాలు, శాస్త్రాల్లో పేర్కొన్న విషయాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..