Drugs Addiction in Women: అమ్మాయిల్లో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసనం.. కారణం ఇదే!
డ్రగ్స్ వ్యసనం ఆరోగ్యానికి చాలా హానికరం. అయితే నేటి కాలంలో మద్యం, గంజాయి, చరస్‌లు, సిగరెట్‌ల మాయలో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో పురుషులలో ఈ వ్యసనం ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. అయితే అమ్మాయిల్లో కూడా ఈ వ్యసనాల ధోరణి రోజురోజుకూ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రెండ్ ప్రధానంగా నగరాలు, శివారు ప్రాంతాల్లో పెరుగుతోంది. గ్రామాలపై ఈ ధోరణి తక్కువ. ఆడపిల్లల్లో డ్రగ్స్ వ్యసన ధోరణి ఎందుకు పెరుగుతోంది అనే ప్రశ్న సహజంగానే అందరి మదిలో మెదులుతుంది..
Updated on: Mar 26, 2024 | 1:28 PM

డ్రగ్స్ వ్యసనం ఆరోగ్యానికి చాలా హానికరం. అయితే నేటి కాలంలో మద్యం, గంజాయి, చరస్‌లు, సిగరెట్‌ల మాయలో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో పురుషులలో ఈ వ్యసనం ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. అయితే అమ్మాయిల్లో కూడా ఈ వ్యసనాల ధోరణి రోజురోజుకూ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రెండ్ ప్రధానంగా నగరాలు, శివారు ప్రాంతాల్లో పెరుగుతోంది. గ్రామాలపై ఈ ధోరణి తక్కువ. ఆడపిల్లల్లో డ్రగ్స్ వ్యసన ధోరణి ఎందుకు పెరుగుతోంది అనే ప్రశ్న సహజంగానే అందరి మదిలో మెదులుతుంది. అమ్మాయిలలో వ్యసనానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం..

ఈ వ్యసనాలకు కుటుంబంతో సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా డ్రగ్స్ తీసుకునే వారు ఉన్నట్లయితే వారి కుమారులు, కుమార్తెలలో ఈ విధమైన ధోరణి కనిపిస్తుంది. స్త్రీ మానసిక స్థితి వ్యసనానికి గల మరొక కారణం. అవును.. తక్కువ ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులు, ఏ పరిస్థితిలోనైనా ఆందోళనకు గురవుతారు. సాధారణంగా ఇటువంటి వారిలో మాననసిక దృఢత్వం తక్కువగా ఉంటుంది. మానసిక బలం లేకపోవడంతో వ్యసనాల వలలో చిక్కుకుంటారు.

చాలా మంది మహిళలు డిప్రెషన్ కారణంగా వ్యసనం ఉచ్చులో పడతారు. బ్రేకప్‌తో నిరాశ చెందడం లేదా కెరీర్‌లో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడం వంటి కారణాల వల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. చాలా మంది దాని నుండి బయటపడటానికి ఈ విధమైన తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నా

డ్రగ్స్ వ్యసనానికి వ్యక్తిత్వ లోపాలు కూడా ఒక కారణం కావచ్చు. చాలా మందికి తమ స్నేహితులు, పొరుగువారు డ్రగ్స్ తీసుకోవడం చూసినప్పుడు వారిలో కూడా ఆ కోరిక కలుగుతుంది. ఈ విధంగా చాలా మంది వ్యసనాల వలయంలో చిక్కుకుంటున్నారు.

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి.. ఆల్కహాల్ తాగడం వల్ల, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. పైగా ఈ అలవాట్లు శరీరానికి వివిధ నష్టాలను కలిగిస్తుంది. ధూమపానం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇక అమ్మాయిల్లో సక్రమంగా రుతుక్రమం రాదు. గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యవంతమైన జీవితానికి మాదకద్రవ్యాల రహిత జీవితం ఎంతో సుఖమయం చేస్తుంది.




