- Telugu News Photo Gallery Apple Cider Vinegar: Is Using Apple Cider Vinegar Safe For Skin And Hair? Know Here
Apple Cider Vinegar: జుట్టు, చర్మానికి యాపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నారా? ఈ తప్పులు చేశారో ఇక అంతే..
బరువు తగ్గడం నుంచి చర్మ సంరక్షణ వరకు, ఆపిల్ సైడర్ వెనిగర్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో చాలా మంది దీనిని చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. అయితే దీనిని ఉపయోగించడం మంచిదేనా? అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా.. ఆ వివరాలు మీకోసం. నిజానికి, ఆపిల్ సైడర్ వెనిగర్ వేలాది చర్మ సమస్యలకు సహజ పరిష్కారం. ఈ వెనిగర్ మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను తొలగించి, చర్మం pHని సమతుల్యం..
Updated on: Mar 26, 2024 | 1:14 PM

బరువు తగ్గడం నుంచి చర్మ సంరక్షణ వరకు, ఆపిల్ సైడర్ వెనిగర్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో చాలా మంది దీనిని చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. అయితే దీనిని ఉపయోగించడం మంచిదేనా? అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా.. ఆ వివరాలు మీకోసం. నిజానికి, ఆపిల్ సైడర్ వెనిగర్ వేలాది చర్మ సమస్యలకు సహజ పరిష్కారం. ఈ వెనిగర్ మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను తొలగించి, చర్మం pHని సమతుల్యం చేస్తుంది. అందుకే యాపిల్ సైడర్ వెనిగర్ చర్మ సంరక్షణలో ఎంతో విలువైనది.

చర్మాన్ని స్క్రబ్బింగ్ చేయకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయాలనుకుంటే, ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. అలాగే అకాల వృద్ధాప్యం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. అసమాన స్కిన్ టోన్ సమస్య కూడా తగ్గుతుంది. అదేవిధంగా, ఆపిల్ సైడర్ వెనిగర్ జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రు చికిత్సలో సహాయపడుతుంది. ఇది సహజ ఎంజైమ్‌లు, విటమిన్‌లను కూడా కలిగి ఉంటుంది.ఇది జుట్టు పెరుగుదలకు, తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టుకు సహజమైన మెరుపు సంతరించుకుంటుంది. వెంట్రుకలు చిట్లకుండా ఉంటాయి. తల చర్మం కూడా శుభ్రంగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆపిల్ సైడర్ వెనిగర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై దద్దుర్లు, చికాకు కలుగుతాయి. pH స్థాయికి అంతరాయం కలిగించడం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది. ఎగ్జిమా సమస్య పెరగవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.

తలపై ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. వెనిగర్ ను తరచుగా వాడటం వల్ల నల్లటి జుట్టు వాడిపోతుంది. స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ పెరగవచ్చు. కాబట్టి చర్మం లేదా జుట్టుకు దీనిని వినియోగించాలనుకుంటే ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ కంటే ఎక్కువ ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించకూడదు.




