Vastu Tips: ఇంట్లో సోఫాను ఎక్కడ పెడుతున్నారు.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..

ఇంట్లో ఎక్కువ సేపు సమయం గడిపేది టీవీ ముందే. సహజంగా మనలో చాలా మంది ఇదే పని చేస్తుంటారు. మరి టీవీ చూడాలంటే కచ్చితంగా సోఫాలో కూర్చోవాల్సిందే. మరి రోజులో ఎక్కువ సమయం గడిపే సోఫా విషయంలో వాస్తు చిట్కాలు ఫాలో కాకపోతే ఎలా చెప్పండి. అందుకే సోఫా కలర్‌ ఎంపిక నుంచి దానిని ఏర్పాటు చేసే దిశ వరకు కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలని..

Vastu Tips: ఇంట్లో సోఫాను ఎక్కడ పెడుతున్నారు.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..
Vastu Tips
Follow us

|

Updated on: Mar 26, 2024 | 4:37 PM

వాస్తు శాస్త్రాన్ని మనలో చాలా మంది విశ్వసిస్తుంటారు. మరీ ముఖ్యంగా భారతీయుల్లో వాస్తుపై ఎంతో విశ్వాసం ఉంటుంది. ఇంటి నిర్మాణం మొదలు ఇంట్లో ఉండే ప్రతీ వస్తువు వాస్తు పరంగా ఉండాలని వాస్తు పండితులు చెబుతుంటారు. టీవీ మొదలు ఫ్రిడ్జ్‌ వరకు, బీరువా నుంచి చివరికి సోఫా వరకు వాస్తు వర్తిస్తందని పండితులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సోఫాను ఏ దిశలో పెట్టుకోవాలి.? సోఫా విషయంలో ఎలాంటి వాస్తు పద్ధతులు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో ఎక్కువ సేపు సమయం గడిపేది టీవీ ముందే. సహజంగా మనలో చాలా మంది ఇదే పని చేస్తుంటారు. మరి టీవీ చూడాలంటే కచ్చితంగా సోఫాలో కూర్చోవాల్సిందే. మరి రోజులో ఎక్కువ సమయం గడిపే సోఫా విషయంలో వాస్తు చిట్కాలు ఫాలో కాకపోతే ఎలా చెప్పండి. అందుకే సోఫా కలర్‌ ఎంపిక నుంచి దానిని ఏర్పాటు చేసే దిశ వరకు కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రాకరం హాల్‌లో వేసుకొకే సోఫా కలర్స్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా ముదురు ఎరుపు, ముదురు ఆకుపచ్చ లేదా ముదురు నీలం లాంటి రంగులను ఎట్టి పరిస్థితుల్లో సెలక్ట్ చేసుకోకండి. వీలైనంత వరకు లైట్ కలర్స్‌లోనే సోఫాలు ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. ముదురు రంగు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతుంటారు.

ఇక సోఫాను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. అలాగే ఇంటి మధ్యలో కూడా సోఫాను ఏర్పాటు చేయకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. సోఫాను పెట్టుకోవడానికి బెస్ట్ ప్లేస్‌ పశ్చిమ దిశ. ఈ దిశలో సోఫాను ఉంచడం వల్ల మంచి జరుగుతుంది. ఇక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో జంతువలు చర్మాలను ఉపయోగించి చేసిన లెదర్‌ సోఫాలు ఉపయోగించకపోవడమే ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..