భూమ్మీద నూకలుంటే.. భూకంపం వచ్చినా బతికిస్తారు.. రైలు కిందపడ్డ మూడేళ్ల చిన్నారి సురక్షితం!
భూమ్మీద బతికే రోజులుంటే.. భూకంపం నుంచి కూడా బతికి బయట పడతారంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు కడప జిల్లాలో జరిగింది. దూసుకెళ్తున్న ట్రైన్ నుంచి జారిపడిన ఓ పాప స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. మృత్యుంజయురాలిగా నిలిచింది. అప్పటి వరకు కన్నీరు మున్నీరుగా విలపించిన పాప తల్లిదండ్రులు, చిన్నారి కనిపించడంతో ఆనందంతో పొంగిపోయారు. కడప నుంచి నంద్యాల వెళ్లే డెమో ట్రైన్ వెళుతోంది. కొల్లూరు మండలం తప్పెట్ల దగ్గర మూడేళ్ల పాప రైలులో నుంచి ప్రమాదవశాత్తు […]
భూమ్మీద బతికే రోజులుంటే.. భూకంపం నుంచి కూడా బతికి బయట పడతారంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు కడప జిల్లాలో జరిగింది. దూసుకెళ్తున్న ట్రైన్ నుంచి జారిపడిన ఓ పాప స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. మృత్యుంజయురాలిగా నిలిచింది. అప్పటి వరకు కన్నీరు మున్నీరుగా విలపించిన పాప తల్లిదండ్రులు, చిన్నారి కనిపించడంతో ఆనందంతో పొంగిపోయారు.
కడప నుంచి నంద్యాల వెళ్లే డెమో ట్రైన్ వెళుతోంది. కొల్లూరు మండలం తప్పెట్ల దగ్గర మూడేళ్ల పాప రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయింది. వెంటనే ట్రైన్ ఆపేందుకు ప్రయత్నించిన తల్లి, తొటి ప్రయాణికులు విఫలమయ్యారు. రైలు ఆగకుండా వెళ్లిపోయింది. పాప పడటం గమనించిన గ్యాంగ్ మెన్, వెంటనే వెనుక వచ్చే రైలుకు సమాచారం ఇచ్చాడు. అనంతరం కొల్లూరు నుంచి గూడ్స్ ట్రైన్‌లో పాపను తీసుకువచ్చి కమలాపురంలో తల్లికి అప్పగించారు రైల్వే సిబ్బంది. దీంతో పాపను కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
వీడియో చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…