Women Health: గర్భధారణ సమయంలో జ్వరం వస్తే ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు చెబుతున్న కీలక వివరాలు..
గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. దీని కారణంగా తరచుగా మూత్ర విసర్జన, మలబద్ధకం, గ్యాస్ అధికంగా ఏర్పడటం, మానసిక కల్లోలం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఏర్పడతాయి. కొంతమంది మహిళలకు గర్భధారణ సమయంలో జ్వరం కూడా వస్తుంది. గర్భధారణ సమయంలో జ్వరం అనేది ఒక సాధారణ విషయం. కానీ ఇది ప్రతి కొన్ని నెలలు, రోజులకు సంభవిస్తే, దానిని విస్మరించకూడదు.

Women Health: గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. దీని కారణంగా తరచుగా మూత్ర విసర్జన, మలబద్ధకం, గ్యాస్ అధికంగా ఏర్పడటం, మానసిక కల్లోలం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఏర్పడతాయి. కొంతమంది మహిళలకు గర్భధారణ సమయంలో జ్వరం కూడా వస్తుంది. గర్భధారణ సమయంలో జ్వరం అనేది ఒక సాధారణ విషయం. కానీ ఇది ప్రతి కొన్ని నెలలు, రోజులకు సంభవిస్తే, దానిని విస్మరించకూడదు. వైద్యుల ప్రకారం.. గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఈ కారణంగా.. వారు సులభంగా వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురవుతుతారు. దీని వలన జ్వరం వస్తుంది.
గర్భధారణ సమయంలో ఫ్లూ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. దీని వల్ల దగ్గు, జలుబు, జ్వరం వస్తాయి. లిస్టెరియోసిస్ వ్యాధి గర్భధారణ సమయంలో జ్వరం కూడా కలిగిస్తుంది. అయితే, ఈ సమస్య అందరు స్త్రీలలో ఉండదు. అయితే జ్వరం మంచి సంకేతమా? దీని గురించి వైద్యులు ఏమంటున్నారు? కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జ్వరం మంచి సంకేతమా?
ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రకారం.. గర్భధారణ సమయంలో జ్వరం రావడం సాధారణ విషయమే. శరీరంపై కొన్ని బ్యాక్టీరియా దాడి చేస్తే.. ఆ దాడి ప్రభావాలను తొలగించడానికి శరీరం పని చేస్తుందనడానికి ఇది సంకేతం. అటువంటి పరిస్థితిలో.. జ్వరం వచ్చినా హాని లేదు. కానీ ప్రతి నెలా ఈ సమస్యను ఎదుర్కొంటున్న మహిళలు వెంటనే చికిత్స పొందాలి. రోగనిరోధక శక్తి బాగా బలహీనపడిందనడానికి ఇది సంకేతం. ఇది గర్భధారణ సమయంలో ఏదైనా ఇతర ప్రమాదకరమైన సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, జ్వరం సమస్య కొనసాగితే.. అప్పుడు వైద్యుడిని సంప్రదించండి. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. జ్వరం తరచుగా సంభవించడం కూడా కొన్ని ప్రమాదకరమైన వ్యాధికి సంకేతంగా ఉంటుంది.
మీరే చికిత్స చేయవద్దు..
చాలా సందర్భాల్లో మహిళలు జ్వరం వచ్చినప్పుడు సొంతంగా మందులు తీసుకోవడం ప్రారంభిస్తారని, అయితే అలా చేయడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మందుల అలవాటు స్త్రీ కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి తమకు తాముగా చికిత్స చేసుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు.
ఈ విషయాలను గుర్తుంచుకోండి..
1. గర్భధారణ సమయంలో ఎక్కువ ద్రవ ఆహారం తీసుకోవాలి.
2. శరీరమంతా కప్పి ఉంచుకోవాలి.
3. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.
4. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి.
5. చేతులు కడుక్కున్న తర్వాత ఆహారం తినండి.
6. అనారోగ్యంతో ఉన్న ఎవరితోనూ సంప్రదించవద్దు
మరిన్ని హెల్త్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




