Winter Tips: ఆస్తమా రోగులకు అలెర్ట్‌.. చలికాలంలో వీటిని అసలు తినకూడదు.. ఎందుకంటే?

|

Nov 11, 2022 | 8:55 AM

ఆస్తమా రోగులు చలికాలంలో చల్లని, పుల్లని పదార్థాలకూ దూరంగా ఉండడం మేలు. ఐస్ క్రీం, చల్లటి నీరు, నిమ్మకాయ, పచ్చి పెరుగు మొదలైన వాటిని తీసుకోవడం వల్ల ఉబ్బసం సమస్యలు తీవ్రతరం అవుతాయి.

Winter Tips: ఆస్తమా రోగులకు అలెర్ట్‌.. చలికాలంలో వీటిని అసలు తినకూడదు.. ఎందుకంటే?
Asthma Patients
Follow us on

ఇతర సీజన్లతో పోల్చుకుంటే శీతాకాలంలో అందం, ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలోని అనూహ్య మార్పులు మన ఆరోగ్యానికి తీవ్ర ప్రతిబంధకంగా మారుతాయి. అందుకే ఈ సీజన్‌లో ఆరోగ్యం పరంగా మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఆస్తమా నిపుణులు మరింత అలెర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. ఈ సీజన్‌లో ఆస్తమా రోగుల శ్వాసనాళాలు ఉబ్బిపోవడం వల్ల ఈ సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి. ఫలితంగా జలుబు, దగ్గు, ఫ్లూ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఆస్తమా రోగులు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. అలాగే ఆహారం విషయంలోనూ కొన్ని నియమాలు పాటించడంతో పాటు కొన్ని ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తమా రోగులు చలికాలంలో చల్లని, పుల్లని పదార్థాలకూ దూరంగా ఉండడం మేలు. ఐస్ క్రీం, చల్లటి నీరు, నిమ్మకాయ, పచ్చి పెరుగు మొదలైన వాటిని తీసుకోవడం వల్ల ఉబ్బసం సమస్యలు తీవ్రతరం అవుతాయి. దగ్గు సమస్యలు కూడా బాగా ఇబ్బంది పెడతాయి.

టీ, కాఫీలకు దూరంగా..

చాలా మంది చలికాలంలో కప్పుల కొద్దీ టీలు, కాఫీలు లాగేస్తుంటారు. శీతాకాలంలో, ఒక కప్పు టీ లేదా కాఫీ శరీరాన్ని వేడి చేస్తుంది, అయితే ఆస్తమా రోగులు ఎక్కువగా టీ లేదా కాఫీని తాగకూడదు. ఎందుకంటే టీ లేదా కాఫీ ఆస్తమా రోగుల సమస్యను మరింత పెంచుతుంది. నిజానికి టీ, కాఫీలు తాగడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. ఇది ఆస్తమా సమస్యలను మరింత పెంచుతుంది. ఇక డైట్‌ విషయానికొస్తే.. వీరు పప్పులు, కూరగాయల్లో లవంగాలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, దాల్చినచెక్కను భాగంగా చేసుకోవాలి. మెంతికూర తినడం కూడా అలవాటు చేసుకోవడం మంచిది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అల్లం టీని రోజుకు రెండుసార్లు తాగాలి. అయితే పాలు లేకుండా టీ తాగడం మరీ మంచిది.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..