AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrealth Tips: అలా చేస్తుంటే వెంటనే మానుకోండి.. లేదంటే ఆరోగ్యం పాడవుతుందంట..

రాత్రి పడుకునే సమయంలో మనం ఉదయం ఎన్ని గంటలకు లేవాలో డిసైడ్ అవుతూఉంటాం. కాలేజీలకు వెళ్లే వారైనా లేదా ఉద్యోగాలు చేసుకునే వారితో పాటు చాలా మంది పడుకునే ముందు అలారం పెట్టుకుని పడుకుంటాం. ఎన్ని గంటలకు లేవలో నిర్ణయించుకుని ఓ గంట ముందో, అరగంట ముందో..

Hrealth Tips: అలా చేస్తుంటే వెంటనే మానుకోండి.. లేదంటే ఆరోగ్యం పాడవుతుందంట..
Snooze Alarm
Amarnadh Daneti
|

Updated on: Oct 07, 2022 | 1:42 PM

Share

రాత్రి పడుకునే సమయంలో మనం ఉదయం ఎన్ని గంటలకు లేవాలో డిసైడ్ అవుతూఉంటాం. కాలేజీలకు వెళ్లే వారైనా లేదా ఉద్యోగాలు చేసుకునే వారితో పాటు చాలా మంది పడుకునే ముందు అలారం పెట్టుకుని పడుకుంటాం. ఎన్ని గంటలకు లేవలో నిర్ణయించుకుని ఓ గంట ముందో, అరగంట ముందో అలారం మోగేలా టైమ్ సెట్ చేసుకుంటాం. అలారం ఉంది కదా అని హాయిగా నిద్రపోతుంటారు. అయితే టైమ్ అయ్యి అలారం మోగుతుంటే మాత్రం.. అప్పుడే టైమ్ అయిపోయిందా.. సరేలే ఓ పది నిమిషాలు ఆగి లేద్దాంలే అంటూ అలారాన్ని స్నూజ్ చేసుకుంటూ వెళ్తారు. దాదాపు కొంతమంది మినహిస్తే మిగిలినవారంతా రెగ్యులర్ గా చేసే పని ఇదే. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా కొంతమంది అలారం లేకుండానే ఒక టైమ్ ఫిక్స్ చేసుకుంటే ప్రతి రోజూ ఆ సమయానికి లేస్తారు. వారు శరీరంలోనే ఓ అలారాన్ని సెట్ చేసుకుంటారు. వారు అనుకున్న టైం అయిందంటే చాలు ఎటువంటి అలారం లేకుండా, ఎవరూ లేపాల్సిన అవసరం లేకుండా నిద్రలేస్తారు. అయితే శరీరంలో నిద్ర చక్రాలు ఉంటాయి. ఒక నిద్ర చక్రం నిడివి 75 నుంచి 95 నిమిషాలు ఉంటుంది. మనలో చాలా మందికి రాత్రి సమయంలో మూడు నుంచి నాలుగు నిద్ర చక్రాలు ఉంటాయి. ఉదయం మన శరీరం సహజంగా లేవడానికి ఒక గంట ముందు నుంచే మన మెదడు, శరీరాన్ని సిద్ధం చేయడం ప్రారంభిస్తుంది. జీవశాస్త్రం మనల్ని తయారు చేసిన మార్గం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సరైన మార్గంలో నిద్రలేచే మార్గం.

నేటి ఆధునిక కాలంలో చలా మంది అలారం మీదనే ఆధారపడతున్నారు. ఇప్పుడు కూడా కొంత మంది పెద్దవాళ్లు అలారం లేకుండానే అనుకున్న సమయానికి నిద్రలేస్తారు. నిద్ర లేచేందుకు అలారం పెట్టుకున్నప్పటికి అది మోగినప్పుడు.. స్నూజ్ బటన్ ప్రెస్ చేసి మళ్లీ పడుకుంటారు. అయితే ఇలా తాత్కాలికంగా ఆపి మళ్లీ నిద్రలోకి వెళ్లడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం ద్వారా నిద్ర చక్రం మధ్యలో మెదడుకు అంతరాయం కలిగిస్తుందని చెబుతున్నారు. రోజూ ఇలా చేయడం ద్వారా మెదడుకు ఆరోగ్యకరమైనది కాదని, దీనివల్ల నిద్రలేచినా.. ఆ నిద్ర మీద వ్యామోహంతోనే ఉంటారని హెచ్చరిస్తున్నారు. అలా నిద్రలేచిన వారి మెదడు చురుగ్గా పనిచేయదని. సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, కొత్త విషయాలను గుర్తుంచుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, భయం, ఆందోళన, కోపం, ఒత్తిడి, చికాకు వంటి భావోద్వేగాలను నియంత్రించడం ఇలాంటి వారిలో చాలా కష్టతరంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

సాధారణంగా అలారం పై ఆధారపడిన వారు ఒకే అలారంతో లేవడం కష్టంగానే ఉంటుంది. కానీ అలా ఒకసారి అలారం మోగగానే లేస్తే ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందవచ్చని అంటున్నారు. వారాంతాల్లో సహా ప్రతిరోజు ఉదయం ఒకే సమయంలో నిద్రలేవడానికే శరీరం ఇష్టపడుతుందని సూచిస్తున్నారు. ఒక వేళ సెలవు రోజని ఎవరైనా ఆలస్యంగా లేవడాన్ని అలవాటు చేసుకుంటే ఆ బద్ధకానికి శరీరం అలవాటుపడిపోతుందని, అందుకే ఏ రోజైనా సరే ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవడమే ఆరోగ్యానికి ఉత్తమమైన మార్గమని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..