AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnant Woman: మహిళలు గర్భధారణ సమయంలో చింతపండు తినొద్దు.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన గైనకాలజిస్ట్‌

గర్భిణీ స్త్రీలు పులుపు తినడానికి ఇష్టపడతారు. వారు పుల్లని ఆహారం తినేందుకు ఆసక్తి చూపుతారు. పుల్లటి వాటిలో చింతపండు ఒకటి. అయితే ఈ చింతపండు నిజంగా మహిళలకు మేలు చేస్తుందా? గర్భిణీలకు చింతపండు ప్రాణాంతకం అంటున్నారు వైద్యులు. దీని గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ పురవి ముఖర్జీ వివరించారు. పురవి చాలా కాలంగా స్త్రీ జననేంద్రియ..

Pregnant Woman: మహిళలు గర్భధారణ సమయంలో చింతపండు తినొద్దు.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన గైనకాలజిస్ట్‌
Pregnant Woman
Subhash Goud
|

Updated on: Apr 09, 2024 | 5:39 PM

Share

గర్భిణీ స్త్రీలు పులుపు తినడానికి ఇష్టపడతారు. వారు పుల్లని ఆహారం తినేందుకు ఆసక్తి చూపుతారు. పుల్లటి వాటిలో చింతపండు ఒకటి. అయితే ఈ చింతపండు నిజంగా మహిళలకు మేలు చేస్తుందా? గర్భిణీలకు చింతపండు ప్రాణాంతకం అంటున్నారు వైద్యులు. దీని గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ పురవి ముఖర్జీ వివరించారు. పురవి చాలా కాలంగా స్త్రీ జననేంద్రియ వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. నిజానికి చింతపండు గర్భిణులకు అత్యంత హానికరమని ఆమె చెబుతున్నారు.

గర్భధారణలో మూడు దశలు ఉన్నాయి. మొదటి, రెండవ, మూడవ త్రైమాసికంలో పురవి మొదటి త్రైమాసికంలో చింతపండు తినకూడదంటున్నారు. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత, అంటే మొదటి త్రైమాసికంలో చింతపండు తినడం ప్రారంభిస్తే అది ఆమెకు హాని కలిగిస్తుందని చెప్పారు. చింతపండు గర్భిణీ స్త్రీలలో గ్యాస్, అసిడిటీని కలిగిస్తుంది. కడుపులోని అధిక ఆమ్లం పిండానికి హాని కలిగిస్తుంది. పిండం దెబ్బతినవచ్చు. గర్భస్రావానికి కారణం కావచ్చు.

ఐతే ఆడవాళ్ళు పులుపు తినకూడదా? అంటే తప్పకుండా తినవచ్చు అంటున్నారు పురవి. గర్భధారణ సమయంలో మహిళలు చింతపండు తినవచ్చు. కానీ అది గర్భం మూడవ త్రైమాసికం అంటే 7 నుండి 9 నెలల మధ్య కాలంలో తినొచ్చు. అది కూడా మరి ఎక్కువ కాకుండా అతి తక్కువ మోతాదులో తింటే ఏమి కాదంటున్నారు. గర్భిణులు ఎక్కువగా చింతపండును తీసుకుంటు పుట్టబోయే బిడ్డకు నష్టం జరుగుతుందని సూచిస్తున్నారు. గర్భం దాల్చిన మహిళ మొదల్లో చింతపండు తినే అలవాటు చేసుకుంటే అబర్షన్‌ అయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి