AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Measles: చిన్నారుల్లో మీజిల్స్‌ ముప్పు.. ప్రపంచవ్యాప్తంగా భారీగా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటోన్న నిపుణులు..

కరోనా మహమ్మారి తర్వాత మరో వ్యాధి భయాందోళనకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో మీజిల్స్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముంబైలో తాజాగా మీజిల్స్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది...

Measles: చిన్నారుల్లో మీజిల్స్‌ ముప్పు.. ప్రపంచవ్యాప్తంగా భారీగా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటోన్న నిపుణులు..
Measles
Narender Vaitla
|

Updated on: Nov 29, 2022 | 12:04 PM

Share

కరోనా మహమ్మారి తర్వాత మరో వ్యాధి భయాందోళనకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో మీజిల్స్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముంబైలో తాజాగా మీజిల్స్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే మీజిల్స్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

మీజిల్స్ వ్యాధి ఇంతలా వ్యాప్తి చెందడానికి కరోనా కారణమని నిపుణులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో మీజిల్స్‌ వ్యాక్సినేషన్‌ భారీగా తగ్గింది. దీంతో కోట్లాది మంది నవజాత శిశువుల్లో మీజిల్స్‌ వ్యాప్తి చెందుతోంది. తాజా నివేదికలో తేలిన అంశాల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 మిలియన్ల మంది చిన్నారులు మీజిల్స్‌ టీకాకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే 2021లో ప్రపంచవ్యాప్తంగా 9 మిలియన్ల కొత్త మీజిల్స్‌ కేసులు నమోదయ్యాయి. 1.28 లక్షల మంది మరణించారు.

వీటిలో 95 శాతానికి పైగా మరణాలు ఆఫ్రికా, ఆసియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించాయి. ప్రపంచంలోని దాదాపు 22 దేశాల్లో మీజిల్స్‌ వ్యాపించింది. ఇక మీజిల్స్‌ వ్యాధిని అడ్డుకోవడానికి టీకా ఒక్కటే మార్గం. ఈ వ్యాధికి నిర్ధిష్టమైన చికిత్స లేపప్పటికీ టీకాలు 97 శాతం ప్రభావితంగా పనిచేస్తాయి. ఈ వ్యాధిని నివారించడానికి పిల్లలకు రెండు మోతాదుల్లో టీకా ఇస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా