AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gum Bleeding: బ్రష్‌ చేసేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారుతుందా? అలక్ష్యం చేస్తే అంతే సంగతులు.. ఇలా చేస్తే మేలు

సాధారణంగా పళ్లు తోముకునేటప్పుడు చిగుళ్లను బ్రష్‌తో గట్టిగా రుద్దితే రక్తస్రావం ప్రారంభమవుతుంది. అయితే దీన్ని చిన్న సమస్యగా విస్మరిస్తున్నారు. కానీ చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యకు దారి తీస్తుంది.

Gum Bleeding: బ్రష్‌ చేసేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారుతుందా? అలక్ష్యం చేస్తే అంతే సంగతులు.. ఇలా చేస్తే మేలు
Bleeding Gums
Basha Shek
|

Updated on: Dec 01, 2022 | 6:01 PM

Share

బ్రష్‌ చేసేటప్పుడు చాలామందికి చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటుంది. కొన్నిసార్లు తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. అయితే పెద్దగా పట్టించుకోరు. ఏం కాదులేనంటూ లైట్‌ తీసుకుంటారు. అయితే దంతాల ఆరోగ్యంపై అలక్ష్యం వస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా పళ్లు దెబ్బతింటే నోటి దుర్వాసన వస్తుంది. ఫలితంగా నలుగురిలో తిరగాలన్నా ఇబ్బంది పడతారు. సాధారణంగా పళ్లు తోముకునేటప్పుడు చిగుళ్లను బ్రష్‌తో గట్టిగా రుద్దితే రక్తస్రావం ప్రారంభమవుతుంది. అయితే దీన్ని చిన్న సమస్యగా విస్మరిస్తున్నారు. కానీ చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యకు దారి తీస్తుంది. అందుకే చిగుళ్లలో రక్తం వచ్చిన మొదటిసారే వైద్యనిపుణులను సందర్శించాలి. అలాగే కొన్ని సహజ చిట్కాలతో చిగుళ్లలో రక్తస్రావం, వాపులను అరికట్టవచ్చు. మరి దంత   సమస్యలను దూరం చేసుకునేందుకు ఏం చేయాలో  తెలుసుకుందాం రండి.

నిమ్మరసం

సాధారణంగా దాహం తీర్చుకోవడానికి, ఆరోగ్యం కోసం మనం నిమ్మరసం తాగుతాం. కానీ లెమన్‌ జ్యూస్‌ సహాయంతో దంతాల ఆరోగ్యా్న్ని కూడా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మీరు చిగుళ్ళలో రక్తస్రావం కూడా నియంత్రించవచ్చు. ఇందు కోసం, గోరువెచ్చని నీటిని తీసుకుని, ఒక నిమ్మకాయను పిండి, దానితో పదేపదే పుక్కిలించాలి. దీని వల్ల చిగుళ్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

లవంగం నూనె

బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళ నుండి రక్తం కారుతూ ఉంటే లవంగం నూనెను కూడా ఉపయోగించవచ్చు . నోటి ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. చిగుళ్లలో రక్తస్రావం ఆపడానికి, లవంగం నూనెను దూదిపై రాసి, ప్రభావితమైన చిగుళ్ల దగ్గర ఉంచితే రక్తస్రావం ఆగిపోతుంది. చిగుళ్లలో రక్తస్రావం జరగకుండా ఉండటానికి పటిక నీటితో రోజుకు 3-4 సార్లు శుభ్రం చేసుకుంటే మంచిదని దంతవైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ధూమపానానికి దూరం..

ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచడంతో పాటు ధూమపానం చిగుళ్ళలో రక్తస్రావం కూడా కలిగిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. తీవ్రమైన చిగుళ్ల వ్యాధికి ధూమపానం ప్రధాన కారణంమని పేర్కొంది.

విటమిన్ సి ఉండేలా..

విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. అలాగే దంతాలు, చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగకుండా నిరోధించవచ్చు. దీని కోసం ఆహారంలో నారింజ, క్యారెట్, చెర్రీస్ తినడం మంచిదని పేర్కొంటున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణులు సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి