Home Remedies: చమటతో శరీరం నుంచి దుర్వాసన వస్తుందా..? ఇలా చేస్తే చక్కటి పరిష్కారం..
శరీరానికి చెమట పట్టడం ఆరోగ్యానికి మంచిదే. మన ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకెళ్లడానికి.. శరీరంలో అధిక ఉండే వేడి తగ్గించడానికి చెమట సహాయ పడుతుంది. మనిషి శరీరంలో..
శరీరానికి చెమట పట్టడం ఆరోగ్యానికి మంచిదే. మన ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకెళ్లడానికి.. శరీరంలో అధిక ఉండే వేడి తగ్గించడానికి చెమట సహాయ పడుతుంది. మనిషి శరీరంలో చెమట పట్టడం అనేది సహజమైన ప్రక్రియ. ముఖ్యమైన ఇది మన శరీర ధర్మం. కానీ కొన్నిసార్లు శరీరానికి అధికంగా చెమటపడుతుంది.. అలాంటి సందర్భాల్లో చర్మంపై ఉండే బాక్టీరియాకు చెమట తోడు కావడం వల్ల మన శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అధికంగా చెమట పట్టడాన్ని పామోప్లాంటర్ హైపర్ హైడ్రోసిస్ అంటారు వైద్యులు. చంకలు, పాదాలు, అరచేతుల్లో ఎక్కువగా చెమట పట్టడం వల్ల ప్రతి ఒక్కరూ అసౌకర్యంగా.. ఇబ్బందిగా భావిస్తుంటారు.
చెమటలు పట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి.. టాక్సిన్స్ బయటకు పంపుతాయి. అయితే అది దుర్వాసనతో కూడిన చెమట అయితే? ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. చెమట దుర్వాసన రాకుండా ఉండేందుకు చాలా మంది పెర్ఫ్యూమ్ వాడుతుంటారు. అయితే ఇది కూడా చాలా మందికి సరిగ్గా పని చేయదు. కాబట్టి శరీర దుర్వాసనను పోగొట్టడానికి సహాయపడే పౌడర్‌లను చూద్దాం. చెమట వాసనను పోగొట్టడానికి వంటగదిలోని కొన్ని పదార్థాలు ఎలా సహాయపడతాయో చూద్దాం.
వెనిగర్..
ఒక శుభ్రమైన పత్తిని తీసుకొని కొద్దిగా వెనిగర్ (రెండు రకాల వెనిగర్, సాధారణ వెనిగర్,ఆపిల్ సైడర్ వెనిగర్ వంటివి)లో వేయండి. వెనిగర్‌ను కొద్దిగా నీటితో కరిగించి చర్మంపై అప్లై చేయండి. నేరుగా చర్మంపై అప్లై చేస్తే కాలిన గాయంలా మారే ఛాన్స్ ఉంది. అందుకే కాటన్ తో కొద్దిగా తీసుకోండి. వెనిగర్ చర్మం pH ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నోటి దుర్వాసనకు కారణమయ్యే అన్ని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
నిమ్మకాయ..
వెనిగర్ లాగా నిమ్మకాయ కూడా చర్మం pH ని సమతుల్యం చేయడానికి ఉత్తమంగా పనిచేస్తుంది. నిమ్మకాయను సగానికి కట్ చేసి చంకలో రుద్దండి. చంకలపై పూయడానికి మీరు పేస్ట్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండితో నిమ్మరసం కలపండి. దీన్ని చంకపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి.
గ్రీన్ టీ..
గిన్నెలో నీటిని మరిగించి ఆపై కొన్ని గ్రీన్ టీ ఆకులను వేయండి. ఇది చల్లబడిన తర్వాత మిశ్రమంలో దూదిని ముంచి ప్రభావిత ప్రాంతాలపై రాయండి. ఈ టెక్నిక్ శరీర దుర్వాసన వదిలించుకోవడానికి సహాయం చేస్తుంది! ఈ పొడిని వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే ఉపయోగించవచ్చు.
టొమాటోస్
స్నానం చేసే నీటిలో టమోటా రసం కలపండి. దానితో స్నానం చేయండి లేదా మీ చేతులు మరియు కాళ్ళను 20-30 నిమిషాలు నానబెట్టండి. ఇందులోని యాంటీసెప్టిక్ గుణాలు దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.
ఇవి కూడా చదవండి: TS MLC Elections 2021 Live: మొదలైన సందడి.. తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికల పోలింగ్..
Chanakya Niti: మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..