Dark Chocolate: డార్క్ చాక్లెట్ తింటే మానసిక ఒత్తిడి తగ్గుతుందట.. అధ్యయనంలో కీలక విషయాలు..
డార్క్ చాక్లెట్స్.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తినడానికి ఇష్టపడుతుంటారు. చాక్లెట్స్ ఎంతో రుచికరంగా
డార్క్ చాక్లెట్స్.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తినడానికి ఇష్టపడుతుంటారు. చాక్లెట్స్ ఎంతో రుచికరంగా ఉండడమే కాకుండా.. అనేక ప్రయోజనాలున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడంతోపాటు.. మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. దక్షిణ కొరియాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సియోల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం డార్క్ చాక్లెట్స్ తింటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని తేలీంది. ఈ అధ్యయనం ఫలితాలను ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో ప్రచురించబడింది. ఐదు రోజులు అధిక ఫ్లేవనాల్ కోకో తినడం వలన మెదడుకు రక్త ప్రసరణ జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కోకోలో కెఫిన్.. థియోబ్రోమిన్ వంటి ఉత్ర్పేరకాలు ఉన్నాయి.. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
అలాగే గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలోనూ డార్క్ చాక్లెట్ ఉపయోగపడుతుంది. ఇది కార్డియోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్ గుండె సంబంధిత వ్యాధుల నివారణలో ప్రయోజనాలను ఇస్తుంది. ఓ వ్యక్తి 85 శాతం వరకు రోజూ చాక్లెట్స్ 30 గ్రాముల వరకు తిన్న పెద్దలలు ఆరోగ్యంగా.. సంతోషంగా ఉన్నట్లుగా ఇటీవల ఓ అధ్యయనంలో తేలీంది. 100 గ్రాముల చాక్లెట్ మూడింట ఒక వంతు 30 గ్రాములు. చాక్లెట్ తినడం వలన మానసిక స్థితి మెరుగుపడడమే కాకుండా సూక్షజీవుల మార్పులు కలుగుతాయి.
85 శాతం కోకో ఉన్న చాక్లెట్ తినడం వలన అనేక ప్రయోజనాలున్నాయని అధ్యయనంలో బయటపడింది. మిల్క్ చాక్లెట్స్ తిన్నవారిలో ప్రవర్తన.. సంతోషంలో ఎలాంటి మార్పులు రాలేదు. అందుకే పాలు కలిసిన చాక్లెట్స్ తక్కువగా తినాలి. వీటిని రోజూ తీసుకోవద్దు. కోకో శాతం ఉన్న చాక్లెట్ ఉత్పత్తులు ఉత్తమం. వాటిలో చక్కెర, కొవ్వు, రంగు, నూనె వంటి సమ్మేళనాలు తక్కువగా ఉంటాయి. అలాగే డార్క్ చాక్లెట్స్… ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లను అందిస్తుంది.
Also Read: Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..
Bheemla nayak: రన్ టైమ్‌ను లాక్ చేసుకున్న భీమ్లా నాయక్.. సినిమా నిడివి ఎంతంటే!