Lemon: నిమ్మకాయ చిన్నదే.. కానీ ఉపయోగాలు బోలెడు.. అవేంటంటే..

మనకు విరివిగా దొరికే నిమ్మకాయలతో శరీరానికి ఎంతో లాభం ఉంటుంది. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుంతుంది. మనం తిన్న ఆహారం అరగటానికి జీర్ణాశయంలోని ఆమ్లాలు తోడ్పడతాయి...

Lemon: నిమ్మకాయ చిన్నదే.. కానీ ఉపయోగాలు బోలెడు.. అవేంటంటే..
Lamen
Follow us

|

Updated on: Oct 24, 2021 | 10:04 PM

మనకు విరివిగా దొరికే నిమ్మకాయలతో శరీరానికి ఎంతో లాభం ఉంటుంది. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుంతుంది. మనం తిన్న ఆహారం అరగటానికి జీర్ణాశయంలోని ఆమ్లాలు తోడ్పడతాయి. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ వీటి స్థాయులు తగ్గుతూ వస్తుంటాయి. నిమ్మరసంలోని ఆమ్లాలు వీటికి చేదోడు వాదోడుగా నిలిచి.. ఆహారం జీర్ణం కావటానికి సహాయ పడతాయి. మనలో చాలామంది తగినంత నీరు తాగరు. దీంతో ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలూ వస్తాయి. రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలా వరకు నివారించుకోవచ్చు. పైగా నిమ్మరసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండానూ సహాయపడుతుంది.

నిమ్మకాయ సగం నిమ్మచెక్క రసం తీసుకున్నా రోజుకు అవసరమైన విటమిన్‌ సిలో ఆరో వంతుకు పైగా శరీరానికి చేరుతుంది. ఇది రోగనిరోధకశక్తిని పుంజుకునేలా చేయటంతో పాటు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. గాయాలు త్వరగా మానటానికి తోడ్పడతుంది. ఇక నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. ఇవి విశృంఖల కణాల మూలంగా తలెత్తే అనర్థాల నుంచి రక్షణ కల్పిస్తాయి.నిమ్మరసంలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు. నాడులు-కండరాల మధ్య సమాచారానికి ఇది అత్యవసరం. అన్ని కణాలకు పోషకాలు అందటానికి, వ్యర్థాలను బయటకు పంపటానికీ ఇది తోడ్పడుతుంది. రక్తపోటుపై ఉప్పు చూపే ప్రభావాన్ని తగ్గించటానికీ మెగ్నీషియం ఉపయోగపడుతుంది.

వెల్లుల్లి వాసన లేదా మరేదైనా బలమైన వాసనను వదిలించుకోవడానికి మీరు ఎప్పుడైనా మీ చేతులకు నిమ్మకాయను రుద్దారా? వెల్లుల్లి, ఉల్లిపాయలు లేదా చేపలు వంటి బలమైన వాసనలతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల కలిగే దుర్వాసనకు నిమ్మకాయ నివారిస్తుంది. మీరు భోజనం తర్వాత ఉదయం ఒక గ్లాసు నిమ్మకాయ నీరు త్రాగడం ద్వారా నోటి దుర్వాసనను నివారించవచ్చు. నిమ్మకాయల్లో ఉండే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు బరువు పెరగకుండా చేస్తాయి.

Read Also.. prouts: మొలకెత్తిన చిరుధాన్యాలతో ఎన్నో లాభాలు.. అవి ఏమిటంటే..