Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: డైనింగ్‌ టేబుల్‌పై భోజనం చేస్తున్నారా.? అయితే మీరు ఈ లాభాలను కోల్పోతున్నట్లే.. నేలపై కూర్చొని తింటే..

Health: మారుతోన్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన శైలిలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎక్కువ శారీరక శ్రమ, తక్కువగా మానసిక శ్రమ ఉండేది. కానీ ఇప్పుడు..

Health: డైనింగ్‌ టేబుల్‌పై భోజనం చేస్తున్నారా.? అయితే మీరు ఈ లాభాలను కోల్పోతున్నట్లే.. నేలపై కూర్చొని తింటే..
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Oct 25, 2021 | 6:49 AM

Health: మారుతోన్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన శైలిలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎక్కువ శారీరక శ్రమ, తక్కువగా మానసిక శ్రమ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. ఇక జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా మనిషి ఆహార అలవాట్లతో పాటు, ఆహారాన్ని తీసుకునే విధానంలోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నేలపై కూర్చొని భోజనం చేసే వారు కానీ ఇప్పుడు డైనింగ్‌ టేబుల్‌పై కూర్చోవడం తప్పనిసరిగా మారిపోయింది.

చాలా వరకు ఇల్లలో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇంతకీ నేలపై కూర్చొని తింటే కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం..

* నేలపై కూర్చొని ఆహారం తీసుకునే సమయంలో ప్లేట్ కింద ఉంటుంది కాబట్టి.. మీరు ప్రతీసారి ముందుకు, వెనక్కి కదలాల్సి ఇస్తుంది. ఇలా చేయడం వల్ల పొట్టలో ఉండే కండరాలు క్రీయాశీలకంగా మారుతాయి. దీంతో తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.

* కింద కూర్చొని తినడం వల్ల వెన్నపూస నిటారుగా ఉంటుంది. ఈ కారణంగా మెదడుకు సమాచారం సులభంగా చేరుతుంది. దీంతో పొట్ట నిండిందన్న విషయాన్ని మెదడు త్వరగా గుర్తించి.. ఇక చాలు అని చెప్పేసింది. దీంతో ఇది బరువు తగ్గడానికి కూడా దోహద పడుతుందన్నమాట.

* ఈ మధ్య కాలంలో నేలపై పద్మాసనంలో కూర్చోవడం పూర్తిగా తగ్గిపోయింది. చెయిర్లు, సోఫాల వాడకం పెరగడంతో అందరూ పైనే కూర్చుంటున్నారు. కానీ నేలపై కూర్చొవడం వల్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే నడుము నొప్పి, ఇతర నొప్పులు రాకుండా చెక్‌ పెట్టవచ్చు.

* నేలపై పద్మాసనంలో కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అదే చెయిర్‌లపై కూర్చుంటే గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కాబట్టి తినే సమయంలోనైనా కింద కూర్చొని తినడం వల్ల పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

చూశారుగా నేలపై కూర్చొని తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో.. మరెందుకు మీరు కూడా ఈరోజు నుంచి డైనింగ్‌ టేబుళ్లను కాస్త పక్కన పెట్టి నేలపై కూర్చొని భోజనం చేయడం మొదలు పెట్టండి..

Also Read: Ritu Varma: నీలి ముత్యం‌లా మెరిసిన తెలుగు అమ్మాయి.. అందాల రీతూ లేటెస్ట్ ఫొటోస్

Fact Check: రోడ్డు విస్తరణ పేరుతో దేవాలయం కూల్చివేత.. సోషల్‌ మీడియా ప్రచారంపై అధికారికంగా స్పందించి ఏపీ ప్రభుత్వం.

Turmeric Water: చక్కనైన ఆరోగ్యానికి పసుపు నీరుని మించింది లేదు.. ఇది ఎలా తీసుకోవాలో తెలుసా?