Fact Check: రోడ్డు విస్తరణ పేరుతో దేవాలయం కూల్చివేత.. సోషల్‌ మీడియా ప్రచారంపై అధికారికంగా స్పందించి ఏపీ ప్రభుత్వం.

Fact Check: సోషల్‌ మీడియా పరిధి పెరిగినప్పటి నుంచి సమాచార మార్పిడి ఎంత వేగంగా మారిందో.. తప్పుడు ప్రచారాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పలు రకాల వార్తలు..

Fact Check: రోడ్డు విస్తరణ పేరుతో దేవాలయం కూల్చివేత.. సోషల్‌ మీడియా ప్రచారంపై అధికారికంగా స్పందించి ఏపీ ప్రభుత్వం.
Image Credits Fact Check Ap
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 25, 2021 | 12:43 AM

Fact Check: సోషల్‌ మీడియా పరిధి పెరిగినప్పటి నుంచి సమాచార మార్పిడి ఎంత వేగంగా మారిందో.. తప్పుడు ప్రచారాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పలు రకాల వార్తలు నెటిజన్లను కొన్ని సందర్భాల్లో తప్పుదోవ పట్టిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వార్తే ఆంధ్రప్రదేశ్‌లో తెగ హల్చల్‌ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాంధ్రకు చెందిన శ్రీ పాతపట్నం, నీలమణి దుర్గ అమ్మ వారి దేవాలయన్నీ రోడు వెడల్పులో భాగంగా కూల్చేశారంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతి పక్ష పార్టీల సోషల్‌ మీడియా పేజీల్లోనూ దీనికి సంబంధించిన కథనాలు వచ్చాయి. ఈ పోస్టులు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎట్టకేలకు అధికారిక ప్రకటన చేసింది.

దేవలయాన్ని కూల్చి వేస్తున్నట్లు జరగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణంలో భాగంగా నీలమణి దుర్గ అమ్మవారి దేవాలయంలోని కేవలం ప్రహారి గోడను, ముఖద్వారాన్ని (ఆలయం ముందు ఉండే ఆర్చ్‌) మాత్రమే తొలగించారని క్లారిటీ ఇచ్చారు. పనులు పూర్తికాగానే తొలగించిన నిర్మాణాలను మళ్లీ పునఃనిర్మిస్తామని అధికారులు హామి కూడా ఇచ్చారని స్పష్టం చేశారు. ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌ తిరిగి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆలయ ఈవో పత్రిక ప్రకటన చేశారు. ఇందులో స్థానిక తహశీల్దార్‌, స్పెషల గ్రేడ్‌ డిప్యూటీ కలక్టర్ , R&B DEE, పోలీసుల సమక్షంలోనే దేవాలయానికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రహరీ గోడను జేసీబీతో తొలగించినట్లు పేర్కొన్నారు. దేవాలయం పునఃనిర్మాణానికి రూ.1,40,57,404 పరిహారాన్ని కూడా అందించినట్లు తెలియజేశారు. దీంతో దేవాలయాన్ని కూల్చి వేస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారానికి చెక్‌ పడనట్లయింది.

Factcheck Ap

Also Read: Yellow Fish: పసుపు పచ్చ చేపను ఎప్పుడైనా చూశారా..! ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

Viral Video: ఎయిర్‏పోర్ట్‏లో ఈ చిన్నారి చేసిన పని చూస్తే సెల్యూట్ కొట్టకుండా ఉండలేరు.. హత్తుకుంటున్న వీడియో…

పెళ్లికాని అబ్బాయిలకు షాక్ .. అక్కడి అమ్మాయిలు అలా డిసైడయ్యారట.. వీడియో