Yellow Fish: పసుపు పచ్చ చేపను ఎప్పుడైనా చూశారా..! ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
Yellow Fish: చేపలు పట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇందుకు చాలా ఓపిక ఉండాలి. అంతేకాదు చేపల గురించిన సమాచారం కూడా తెలిసి ఉండాలి. చాలామంది
Yellow Fish: చేపలు పట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇందుకు చాలా ఓపిక ఉండాలి. అంతేకాదు చేపల గురించిన సమాచారం కూడా తెలిసి ఉండాలి. చాలామంది చాలా రకాల చేపలు చూసి ఉంటారు కానీ ఈ పసుపు పచ్చ చేపను ఎప్పుడు చూసి ఉండరు. కొన్నిసార్లు అనుకోకుండా వింత చేపలు వలలో పడుతాయి. నెదర్లాండ్‌కి చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
నెదర్లాండ్స్‌కు చెందిన మార్టిన్ గ్లాట్జ్ నదిలో చేపల వేటకు వెళ్లాడు. అయితే అతడి వలలో అనుకోకుండా ఒక వింత చేప చిక్కింది. దానిని చూసి అతడితో పాటు అందరు ఆశ్చర్యపోతున్నారు. అతనికి అరటిపండు కలర్‌లో ఓ చేప పడింది. ఈ చేప అరుదైన పిల్లి చేప. ఇది ఐరోపాలోని నదులు, సరస్సులలో ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి మార్టిన్ గ్లాట్జ్ పట్టుకున్న చేపకు ఒక ప్రత్యేకమైన జన్యు వ్యాధి ఉంది. ఈ వ్యాధిని లూసిజం అంటారు. దీని కారణంగా ఈ చేపరంగు పసుపు రంగులోకి మారింది.
ల్యుసిజం అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత. దీని కారణంగా జంతువు శరీరం రంగు మారుతుంది. చర్మం, జుట్టు కూడా తేడాగా ఉంటుంది. 2017 సంవత్సరం ప్రారంభంలో USAలోని అయోవాలో ఉన్న మిస్సిస్సిప్పి నదిలో పసుపు క్యాట్ ఫిష్ కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఇలా దర్శనమిచ్చింది. అయితే ఈ చేపను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ చేప ఇలా ఎందుకు ఉందని ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోటోలు తీసుకొని మురిసిపోయారు.
కానీ ఈ చేపలు తినడానికి పనికిరావని మత్స్యకారులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి ఒక రకమైన రుగ్మతతో బాధపడుతుంటాయి. అందుకే వీటికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ చేప ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది లైక్, కామెంట్ చేస్తూ వింతచేప అంటూ ట్రోల్ చేస్తున్నారు.