IND vs PAK, T20 World Cup 2021: మరోసారి పాక్ భరతం పట్టిన కింగ్ కోహ్లీ.. మ్యాచులో టీమిండియా గెలిచేనా?

IND vs PAK: కీలకమైన పోటీలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ టీం ముందు 152 లక్ష్యాన్ని ఉంచింది.

IND vs PAK, T20 World Cup 2021: మరోసారి పాక్ భరతం పట్టిన కింగ్ కోహ్లీ.. మ్యాచులో టీమిండియా గెలిచేనా?
ఇక ఒకవేళ కివీస్‌పై భారత్ ఓటమిపాలైతే.. కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఈ లెక్కన పాకిస్తాన్, న్యూజిలాండ్ సెమీస్ చేరుకుంటాయి. ఇక టీమిండియా సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా న్యూజిలాండ్ మ్యాచ్ గెలవాలి.
Follow us

|

Updated on: Oct 24, 2021 | 9:48 PM

IND vs PAK, T20 World Cup: కీలకమైన పోటీలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ టీం ముందు 152 లక్ష్యాన్ని ఉంచింది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను కింగ్ కోహ్లీ తన క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. కోహ్లీ 57(49 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో పాకిస్తాన్‌పై తన విశ్వరూపం చూపించాడు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో పాకిస్తాన్‌పై 226 పరుగులు సాధించాడు. మొత్తానికి విరాట్ ఒంటరి పోరాటం చేసి భారత్ చెప్పుకోదగిన స్కోర్ చేసేందుకు సహాయపడ్డాడు.

పాకిస్థాన్‌తో జరిగిన టీ 20ల్లో కోహ్లీ అవుట్ కావడం ఇదే తొలిసారి 78*(61) కొలంబో 2012 36*(32) మీర్పూర్ 2014 55*(37) కోల్‌కతా 2016 57(49) దుబాయ్ 2021

టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థికి వ్యతిరేకంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు గేల్ 274 vs ఆస్ట్రేలియా దిల్షాన్ 238 vs WI జయవర్ధనే 226 వర్సెస్ NZ కోహ్లీ 226 వర్సెస్ పాక్

భారీ హోప్స్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు తొలి ఓవర్‌ నుంచే షాకులు తలగడం మొదలయ్యాయి. 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. షాహిన్ అఫ్రిది భారత్‌ను ఆదిలోనే కష్టాల్లో పడేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మను ఎల్బీగా డకౌట్ చేసిన షాహిన్, అనంతరం తన రెండో ఓవర్‌లో కేఎల్ రాహుల్ (3) బౌల్డ్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ భారీ సిక్స్ కొట్టి మాంచి ఊపులో ఉన్నట్లు, అలాగే భారత్‌పై ఉన్న ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ వెంటనే హసన్ బౌలింగ్‌లో 11(8 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) పరుగులకే ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి కోహ్లీ అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. భారీ సిక్సులు కొట్టిన పంత్ కీలక సమయంలో భారత్‌కు అర్థ సెంచరీ భాగస్వామ్యం అందించారు. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో అతనే క్యాచ్ పట్టడంతో రిషబ్ పంత్ 39 (30 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం జడేజా, కోహ్లీ జోడీ మరో కీలక భాగస్వామ్యాన్ని(41 పరుగులు) అందించారు. ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సూపర్ ఇన్నింగ్స్‌తో 45 బంతుల్లో తన అర్థ సెంచరీ(5 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్నాడు.

అయితే కీలక సమయంలో జడేజా 13(12 బంతులు, 1 ఫోర్) రూపంలో భారత్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. హసన్ అలీ బౌలింగ్‌లో నవాబ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అనంతరం కోహ్లీ 57(49 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అయితే తొలిసారి విరాట్ కోహ్లీని పాకిస్తాన్ టీం ఔట్ చేసింది. అనంతరం హార్దిక్(11) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు.

ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ 3, హసన్ అలీ 2, షాదాబ్ ఖాన్ 1, హరిస్ 1 వికెట్ పడగొట్టారు.

చిన్న పిల్లాడి చేతిలో మోసపోయిన హీరోయిన్..
చిన్న పిల్లాడి చేతిలో మోసపోయిన హీరోయిన్..
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం..
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం..
సింహాచలం దేవాస్థానం పరిధిలో మద్యం బాటిళ్లు కలకలం వీహెచ్‌పి నిరసన
సింహాచలం దేవాస్థానం పరిధిలో మద్యం బాటిళ్లు కలకలం వీహెచ్‌పి నిరసన
విష్ణు ప్రియా, పృథ్వీల గాలి తీసేసిన గంగవ్వ..
విష్ణు ప్రియా, పృథ్వీల గాలి తీసేసిన గంగవ్వ..
NEET పరీక్ష విధానం మారుతుందోచ్‌! ఇకపై రెండంచెల్లో వడపోత..
NEET పరీక్ష విధానం మారుతుందోచ్‌! ఇకపై రెండంచెల్లో వడపోత..
శివ కార్తికేయన్‌ను హత్తుకుని ఏడ్చేసిన అమ్మాయిలు.. వీడియో వైరల్..
శివ కార్తికేయన్‌ను హత్తుకుని ఏడ్చేసిన అమ్మాయిలు.. వీడియో వైరల్..
అమెరికెన్లను ఆకట్టుకున్న కమలా .. మహిళకు దక్కని అధ్యక్ష పీఠం
అమెరికెన్లను ఆకట్టుకున్న కమలా .. మహిళకు దక్కని అధ్యక్ష పీఠం
బండ్లగూడ సర్కార్ బడి స్థలం కబ్జాకుయత్నం..ఎదురుతిరిగిన బడి పిల్లలు
బండ్లగూడ సర్కార్ బడి స్థలం కబ్జాకుయత్నం..ఎదురుతిరిగిన బడి పిల్లలు
పెరిగిన పసిడి ధర.. తగ్గిన సిల్వర్ రేటు..ప్రధాన నగరాల్లో నేటి ధరలు
పెరిగిన పసిడి ధర.. తగ్గిన సిల్వర్ రేటు..ప్రధాన నగరాల్లో నేటి ధరలు
హీరో దర్శన్ నుంచి ప్రాణహాని.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫిర్యాదు
హీరో దర్శన్ నుంచి ప్రాణహాని.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫిర్యాదు