ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే మీ గుండె షెడ్డుకు పోతుందని అర్థం.. అస్సలు నెగ్లెట్ చేయకండి..
ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల కేసులు నిరంతరం పెరుగుతున్నాయి.. అయితే.. చాలామంది గుండె వైఫల్యం లక్షణాలను తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా సాధారణ అలసటగా తప్పుగా భావిస్తారు. ప్రజలు తరచుగా దీనిని విస్మరించడం వల్ల.. క్రమంగా ఈ సమస్య పెద్దదిగా మారుతుంది. గుండె వైఫల్యం లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

భారతదేశంలో గుండె ఆగిపోయే (హార్ట్ ఫెయిల్యూర్) కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి, ఒత్తిడి, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యల వల్ల ఈ సమస్య పెరుగుతోంది. గుండె వైఫల్యం లక్షణాలు కనిపించినా.. చాలా మంది అశ్రద్ధ చేస్తారు.. కానీ కొన్నిసార్లు అది నిశ్శబ్దంగా కూడా దాడి చేస్తుంది. చిన్న లక్షణాలను ప్రజలు గుర్తించకుండా విస్మరించవడం ద్వారా.. ఇవి తరువాత తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.. ఇది కొన్ని సార్లు ప్రాణాంతకంగా మారుతుంది.. వైద్య అత్యవసర పరిస్థితికి దారితీయొచ్చు.. ప్రజలు నిర్లక్ష్యం చేసే గుండె వైఫల్యం ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి..? గుండె ఆగిపోవడానికి ముందు కనిపించే లక్షణాలు ఏమిటి..? కార్డియాలజిస్ట్ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో గుండె ఆగిపోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. తీవ్రమైన ఛాతీ నొప్పి ఉంటేనే గుండె ఆగిపోతుందని అనుకుంటారు. కానీ అలా ఏం కాదు.. చాలా సార్లు ప్రజలు తేలికపాటి, క్రమంగా వచ్చే ఛాతీ నొప్పిని గ్యాస్, ఆమ్లత్వం లేదా అలసటతో ముడిపెడతారు. ప్రజలు దానిని చాలా తేలికగా తీసుకోవడం మొదలుపెడతారు. అలసట – బలహీనత వల్ల ఇది జరుగుతుందని వారు భావిస్తారు.. కానీ ఈ సమస్య తీవ్రమైనప్పుడు మనం దానిని తేలికగా తీసుకోకూడదని గ్రహించి.. అప్పుడు వైద్యులను సంప్రదిస్తారు.. అయితే.. ఈ తేలికపాటి, సాధారణ లక్షణాలను ఎలా అర్థం చేసుకోవాలి..? గుండె వైఫల్యం గురించి ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రి కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. పలు సూచనలు చేవారు.
భారతదేశంలో గుండె వైఫల్యం పెద్ద ముప్పుగా మారుతోంది. గత దశాబ్దంలో భారతదేశంలో గుండె ఆగిపోయే కేసులలో దాదాపు 30 శాతం పెరుగుదల ఉంది. ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ చాలా కేసులు గుర్తించబడలేదు. ప్రజలు దీనిని ఒక చిన్న ఆరోగ్య సమస్యగా భావించి తరచుగా విస్మరిస్తారు.
డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. “అధిక అలసట లేదా వాపు వంటి లక్షణాలను ప్రజలు విస్మరిస్తారు. ఇది ఒత్తిడి లేదా మరేదైనా సమస్య వల్ల జరిగి ఉండవచ్చని ప్రజలు అనుకుంటారు, కానీ అప్పటికి మన గుండె బాగా దెబ్బతింటుంది.” అని పేర్కొన్నారు.
మీరు విస్మరించకూడని 5 గుండె వైఫల్య సంకేతాలు..
చాలా మంది గుండె సమస్యలను తీవ్రమైన ఛాతీ నొప్పితో ముడిపెడతారు. గుండె ఆగిపోవడానికి ముందు ఛాతీ నొప్పి అనుభూతి చెందాల్సిన అవసరం లేదు. ఇది గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుందని కొన్ని లక్షణాలు మనకు తెలియజేస్తాయి..
గుండె వైఫల్యానికి ముందు ఛాతీనొప్పితోపాటు.. కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసుకోండి..
రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన: రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి చాలాసార్లు మేల్కొంటే? గుండె కష్టపడినప్పుడు, శరీరంలో ద్రవం పేరుకుపోతుంది.. రాత్రిపూట మూత్రపిండాలు దానిని బయటకు పంపడానికి ప్రయత్నిస్తాయి.
వింత శ్లేష్మంతో నిరంతర దగ్గు: తెలుపు లేదా గులాబీ రంగు శ్లేష్మంతో కూడిన నిరంతర దగ్గు మీ ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోతోందని అర్థం. ఇది ఒక పెద్ద సంకేతం.
ఆకలి లేకపోవడం – వికారం: మీరు ఎల్లప్పుడూ ఎటువంటి కారణం లేకుండా కడుపు నిండినట్లు అనిపిస్తే లేదా వికారం కలిగితే, అది మీ జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. చాలా సార్లు మీకు వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది.
మతిమరుపు – గందరగోళం: మెదడుకు రక్త ప్రవాహం నెమ్మదించడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది లేదా కళ్లు మసకబారడం జరుగుతుంది.
చల్లని చేతులు – కాళ్ళు: బలహీనమైన గుండె అంటే మీ చేతులు, కాళ్ళకు తక్కువ రక్తం చేరుతుంది.. దీనివల్ల అవి చల్లగా, తిమ్మిరిగా లేదా వాపుగా మారుతాయి.
ఇలాంటి లక్షణాలను గమనిస్తే.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
