AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి పిచ్చి ఆకులు కాదు.. పవర్‌ఫుల్.. దెబ్బకు డయాబెటిస్‌తోపాటు ఈ రోగాలన్నీ పరార్..

అందరూ ఇష్టపడి తినగలిగే పండ్లలో జామ పండు ఒకటి.. అయితే.. పండు లానే.. జామ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. జామఆకులలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకులను నమలి తినొచ్చు.. లేదా వాటి రసాన్ని తీసి తాగవచ్చు.. తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కావున జామ ఆకు రసం తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..

ఇవి పిచ్చి ఆకులు కాదు.. పవర్‌ఫుల్.. దెబ్బకు డయాబెటిస్‌తోపాటు ఈ రోగాలన్నీ పరార్..
Guava Leaf Benefits
Shaik Madar Saheb
|

Updated on: Feb 23, 2025 | 5:58 PM

Share

జామ పండు గురించి మనందరికీ తెలసిందే.. పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ అత్యంత రుచికరమైన జామ పండును అందరూ తినే ఉంటారు.. అయితే.. ఈ పండు లాగే జామ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్ అధికంగా ఉంటాయి. అందువల్ల, ఈ ఆకు రసం రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి..అంతేకాకుండా ఇది కొన్ని ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.

జామ ఆకుల రసం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

  1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : అజీర్ణ సమస్యలు ఉన్నవారికి జామ ఆకుల రసం తీసుకోవడం ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ఫైబర్ కు మంచి మూలం. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి, అజీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ ఆకును నీటిలో మరిగించి త్రాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.
  2. మలబద్ధకానికి దివ్యౌషధం : మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, జామ ఆకుల జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. జ్వరం వచ్చినప్పుడు ఈ ఆకు రసం ఒక చెంచా తీసుకున్నా.. లేదా మరిగించి తాగినా జ్వరం వెంటనే ఆగిపోతుంది.
  3. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది : జామ ఆకు రసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది శరీరం క్రిములతో పోరాడటానికి సహాయపడటమే కాకుండా, ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇంకా ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
  4. చర్మం – జుట్టు ఆరోగ్యానికి మంచిది: జామ ఆకు రసం తాగడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు తొలగిపోతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.. ఇవి చర్మ కాంతిని పెంచడమే కాకుండా జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి.
  5. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది : జామ ఆకు రసం తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇలా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
  6. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది : జామ ఆకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ ఆకులు పాలీఫెనాల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువలన, ఇది ఆహారంలో కార్బోహైడ్రేట్ల శోషణను నియంత్రిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..