AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donkey Milk: ఇమ్యూనిటీ బూస్టర్ కావాలా నాయనా.. అయితే గాడిద పాలు ఉన్నాయిగా..

గంగిగోవు పాలు గరిటడైన చాలు, కడవెడైననేమి ఖరము పాలు. ఇది మనం ఇప్పటి వరకూ ఫాలో అవుతూ వచ్చిన విధం. కానీ వీళ్లను చూస్తే. గరిటడైన చాలు.. గాడిద పాలు అంటున్నారు.

Donkey Milk: ఇమ్యూనిటీ బూస్టర్ కావాలా నాయనా.. అయితే గాడిద పాలు ఉన్నాయిగా..
Donkey Milk
Sanjay Kasula
|

Updated on: Jan 05, 2022 | 1:26 PM

Share

గంగిగోవు పాలు గరిటడైన చాలు, కడవెడైననేమి ఖరము పాలు. ఇది మనం ఇప్పటి వరకూ ఫాలో అవుతూ వచ్చిన విధం. కానీ వీళ్లను చూస్తే. గరిటడైన చాలు.. గాడిద పాలు అంటున్నారు. ఆవు పాలు లీటర్ యాభై రూపాయలకు వచ్చేస్తుంటే ఇక్కడ మాత్రం గాడిద పాలు.. కాసిన్ని పాలు యాభై రూపాయలట. చిన్న బాటిల్‌ పాలకు ఎంత డబ్బు తీసుకుంటున్నారో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే వాటికి ఉన్న డిమాండ్ అంతలా ఉంది. ఒమిక్రాన్ ఒక పక్క ఒణుకు పుట్టిస్తుంటే.. జనం దాన్ని తట్టుకోడానికి ఏం చెయ్యాలో అర్ధంకాని గజిబిజిలో ఉన్నారు. ఈ టైంలో… ఎవరేం చెబితే అది చేయడానికి సిద్ధ పడిపోతున్నారు జనం. ఇందులో భాగంగా.. ఇమ్యూనిటీ బూస్టర్లకై తెగ బెతుకుతున్నారు. చివరికి గాడిద పాలను సైతం వదలడం లేదు. దెబ్బకు గాడిద పాల దందా మూడు గాడిదలు.. ఆరు లీటర్ల పాలుగా సాగుతోంది.

ఇతడి మాటలు జనం నమ్మేస్తున్నారా? అయితే ఎంత మేరకని ఆరా తీయగా తేలిందంటేంటే.. ఇటు గాడిద పాలు అమ్మే వ్యక్తి నుంచి అటు ఈ పాలను వాడే వాళ్ల వరకూ.. ఒకటే మాట. ఈ పాల వాడకం చాలా చాలా మంచిది. ఇందులో ఎలాంటి ప్రమాదం ఉండదు. పైపెచ్చు జ్వరం, జలుబు వెంటనే తగ్గిపోతాయి.. ఆ మాటకొస్తే.. ఆస్తమాకు ఇంతకన్నా మించిన ఔషదం లేనే లేదని అంటున్నారు వీళ్లు.

ఇది కేవలం- ఆస్తమాకు సంబంధించిన మందు మాత్రమే కాదు- ఒమిక్రాన్ అంతకంతకు విస్తరిస్తున్న వేళ ఇమ్యూనిటీ కోసం వెంపర్లాడుతున్న సమయాన.. గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతోంది. గాడిద పాలల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉందన్న ప్రచారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఈ డిమాండ్ సప్లై వ్యవహారంలో పడి.. ప్రస్తుతం గాడిద పాల రేటెంతంటే.. 5 నుంచి-10 ఎంల్ యాభై రూపాయలు. ఈ లెక్కన చూస్తే.. లీటర్ గాడిద పాలు ఎంతో లెక్క వేసుకోవచ్చు. ఏంటీ గాడిద పాలకు ఇంత డిమాండా? వేలల్లో ధర పెరిగిపోయిందా? ఇన్నాళ్ల పాటు.. గాడిద అంటే బరువులు మాత్రమే మోసేదనీ.. ఎలాంటి డిమాండ్ లేని జీవి ఏదైనా ఉంటే అది గాడిదేనని భావించేవాళ్లకిది దిమ్మ తిరిగే షాక్ అని చెప్పాలి.

ఇదండి స్టోరీ.. గాడిద పాలకు ఎలాంటి డిమాండ్ ఏర్పడుతోందో. ఇమ్యూనిటీ బూస్టర్ కావాలా నాయనా.. అయితే గాడిద పాలు తాగు అని వచ్చే రోజుల్లో ప్రకటనలు విడుదలైనా ఆశ్చర్యం లేదంటున్నారు కొందరు. రాబోయే రోజుల్లో గాడిద పాల పార్లర్లు కూడా రావొచ్చు.. అంతేందుకు ఇప్పటికే శీతాల కంట్రీల్లో వచ్చేసాయట.

ఇవి కూడా చదవండి: అదిరిపోయే బంపర్ ఆఫర్.. FDలో కంటే ఎక్కువ లాభం.. రిచ్ లోన్ NCDలలో 11 శాతం రాబడి..

Bulli Bai Case: బుల్లీ బాయ్‌ యాప్ వెనకున్న సూత్రధారి ఈమెనా? ఇంకెవరైనా ఉన్నారా..?