Vodafone Idea: వైద్య సేవలు ప్రారంభించనున్న వొడాఫోన్ ఐడియా.. 600 ఆస్పత్రులు.. 400పైగా డాక్టర్లు..
Vodafone Idea: వొడాఫోన్ ఐడియా (Vi) ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్‌తో కూడిన హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ MFine తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులు
Vodafone Idea: వొడాఫోన్ ఐడియా (Vi) ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్‌తో కూడిన హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ MFine తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులు ప్రత్యేకంగా ఆసుపత్రిని సందర్శించకుండా విర్చువల్‌గా వైద్యుడిని సంప్రదించడానికి వీలు కల్పిస్తుంది. హై రిస్క్ ఉన్న రోగులు ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవచ్చు. ఆసుపత్రుల నుంచి ఇన్‌స్టంట్ చాట్ మరియు వీడియో కన్సల్టేషన్‌తో వైద్యులతో కలుపుతుంది. MFine యాప్ ద్వారా, Vi కస్టమర్లు లేదా రోగులు వారు సంప్రదించాలనుకునే ఆస్పత్రి నుంచి వైద్యుడిని ఎన్నుకోవచ్చు. ప్రిస్క్రిప్షన్లు మరియు ఇతర సాధారణ సలహాలు, సూచనలు పొందడానికి రోగులు నేరుగా వైద్యులతో చాట్ చేయవచ్చు లేదా వీడియో ద్వారా సంప్రదించవచ్చు.
MFine యాప్‌లో రోగుల ఇమేజెస్, గత మెడికల్ రికార్డులు, ప్రిస్క్రిప్షన్లను అప్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. వొడాఫోన్ ఐడియా ప్రకారం.. భారతదేశంలోని 600 ప్రసిద్ధ ఆసుపత్రుల నుంచి అగ్రశ్రేణి వైద్య నిఫుణులతో సహా మొత్తం 4000 మందికి పైగా వైద్యులు MFine లో 35 స్పెషలైజేషన్లలో ప్రాక్టీస్ చేస్తున్నారు. Vi చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవ్నీష్ ఖోస్లా మాట్లాడుతూ.. మా వినియోగదారులకు విభిన్న మరియు సంపూర్ణ డిజిటల్ పరిష్కారాలను అందించేందుకు MFine తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కస్టమర్లు వారి ఇంటి సురక్షిత పరిమితులకు లోబడి యాక్సెస్ చేయడానికి వీలుకల్పిస్తున్నట్లు చెప్పారు.
అగ్రస్థానంలో ఐడియా నెట్‌వర్క్.. చాలా రోజుల తర్వాత మొదటిస్థానం.. వెనకబడ్డ దేశీ టెలికాం సంస్థలు..